నోరు బాగా జారుతున్న యాంకర్ సుమ.. మొన్న అలా నేడు ఇలా.. సుడిగాలి సుధీర్ అభిమానులపై కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సోషల్ మీడియాలో సుదీర్ ఫ్యాన్స్ హంగామా ఏ రేంజిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే.

ఈ స్టేజ్ పై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.ఇక కేవలం ఎక్స్ ట్రా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ స్కిట్ కోసం చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే యూట్యూబ్ జబర్దస్త్ లోని ఏ కమెడియన్స్ కింద చూసినా కూడా సుడిగాలి సుదీర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.ఇక ఏ ఈవెంట్ లో అయినా, షోలో అయినా సుధీర్ కనిపిస్తే ఆ సంగతి వేరే విధంగా ఉంటుంది.

అలా కాకుండా ఏదైనా ఈవెంట్లకు సుదీర్ హాజరు కాకపోతే ఆ వీడియోల కింద జై సుధీర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తుంటారు.అయితే జబర్దస్త్ కామెడీ స్కిట్లు కింద జై సుధీర్ అన్న కామెంట్ల గురించి పలువురు స్టేజ్ ఫై స్పందించిన విషయం తెలిసిందే.

Advertisement

అలా సుధీర్ ఫాన్స్ చేసే రచ్చకు యాంకర్ సుమ కూడా ఇబ్బంది పడింది.సుమ యాంకర్ గా వ్యవహరించి షోల వీడియోల కింద సుధీర్ కామెంట్లు కనిపించేవి.

ఇప్పటికీ ఇదే విషయం పై సుమ పలుసార్లు సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.తాజాగా ఈ కామెంట్ల విషయాన్ని సుమ కూడా ప్రస్థావించింది.

సుమ తాజాగా తాను నటించిన జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ స్పెషల్ వీడియో చేసింది.సినిమా ప్రమోషన్లలో ఓ ఐడియా ఇవ్వమని గెటప్ శ్రీనుని సుమ అడుగుతుంది.కేజీయఫ్ చాప్టర్ 2 ఇలా పెద్ద పెద్ద సినిమా టీజర్లు, ట్రైలర్ల కింద మన జై జయమ్మ అని కామెంట్లు పెట్టేద్దామని చెబుతాడు.

అంటే సుధీర్ ఫ్యాన్స్ జై సుధీర్ అని పెడతారు కదా? అలానా? అవి పెట్టించేది నువ్వేనా? అని సుమ అడిగేస్తుంది.మొత్తానికి సుధీర్ ఫ్యాన్స్‌ను మాత్రం సుమ అలా అవమానించేసింది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

వారు అభిమానంతో కామెంట్లు పెడితే.అవేవో డబ్బులిచ్చి పెట్టించినట్టుగా సుమ చెప్పేసింది.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ విషయంపై సుమ ని ఒక ఆట ఆడుకుంటున్నాడు సుదీర్ అభిమానులు.

తాజా వార్తలు