యాంకరింగ్ లో తన తొలి గురువు ఎవరో క్లారిటీ ఇచ్చిన సుమ

తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని వరుస షో లతో దూసుకుపోతున్న వ్యక్తి అంటే ఎవరైనా ఇట్టే సుమ కనకాల అని చెప్పేస్తారు.టెలివిజన్ పై ఆమె హవాని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు.

 Anchor Suma Role Model In Anchoring Career, Tollywood, Telugu Television, Realit-TeluguStop.com

తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో, టైమింగ్ తో పంచులు వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్న సుమ నిజానికి తెలుగమ్మాయి కాదనే విషయం అందరికి తెలిసిందే. కేరళలో పుట్టిన నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ మ్ కెరియర్ ఆరంభంలో సినిమాలు చేసింది.

తరువాత దూరదర్శన్ లో సీరియల్స్ కూడా చేసింది.తరువాత రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకొని నటనకి స్వస్తి చెప్పింది.

అయితే తెలుగు బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు బాషని భాగా నేర్చుకొని ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతుంది.నిజానికి ఈ జెనరేషన్ యాంకర్ చాలా మంది ఉన్న ఆమె తరహాలో తెలుగు మాత్రమే మాట్లాడుతూ యాంకరింగ్ చేసే సామర్ధ్యం ఎవరికీ లేదనే చెప్పాలి.

ఈ కారణంగానే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ నుంచి అన్ని టెలివిజన్ లలో రియాలిటీ షోల వరకు యాంకర్ గా సుమకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.అయితే యాంకర్ గా ఈ స్థాయిలో దూసుకుపోతున్న ఆమెకి రోల్ మోడల్ ఎవరనే విషయం చాలా మందికి డౌట్ ఉంది.

తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంది.ఆమె కంటే ముందుగా యాంకర్ గా ఝాన్సీ, ఉదయభాను ఒక రేంజ్ ని చూసారు.

మరి సుమకి ఎవరు ఈ రంగంలోకి రావడానికి, అలాగే ఈ స్థాయిలో యాంకర్ గా తన టాలెంట్ తో దూసుకోవడానికి కారణం అనే విషయాలని ఆమె స్వయంగా రివీల్ చేసింది.యాంకర్ గా సెన్సాఫ్ హ్యూమర్ తో ఇలా మాట్లడడానికి తన తల్లి కారణమని చెప్పింది.

చిన్నప్పుడు ఇంట్లో అమ్మ సరదాగా మాట్లాడేదని తనకు కూడా అదే అలవాటైందని తెలిపింది.ఆ విధంగా యాంకరింగ్ లో తన తొలి గురువు అమ్మ అని చెప్పింది సుమ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube