ప్రదీప్ 'పెళ్లిచూపులు' షో కి 'యాంకర్ సుమ' రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? ఒక్కో ఎపిసోడ్ కు అంతనా.?     2018-10-09   08:35:31  IST  Sainath G

బిగ్ బాస్ ముగియగానే మరో కొత్త షో కు తెరతీసింది మా టీవీ. ప్రదీప్, సుమ కీ రోల్ లో “పెళ్లి చూపులు” స్టార్ట్ అయ్యింది. కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ షో. యాంక‌ర్ ప్రదీప్ తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఈ షో ద్వారా ఎంపిక చేసుకుంటున్నట్లు ప్ర‌చారం చేస్తొంది. ఆదివారం నుండి ప్రారంభం అయిన ఈ షో కోసం కొన్ని వందల మంది అమ్మాయిలు అప్పై చేసుకోగా చివరకు 14 మంది సెలక్ట్ అయ్యారని టాక్. కానీ అనుకునేంత రేంజ్ లో ఈ షో హిట్ అవ్వలేకపోయింది.

Anchor Suma Remuneration For Pradeep Pelli Choopulu Show-

బుల్లితెరపై ఎన్నో రికార్డులు సృష్టించిన సుమ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోందని చెప్పాలి. దీప్ కి పెర్ఫెక్ట్ జోడీని వెతికి పెట్టేపనిలో ఇంకా చెప్పాలంటే పెళ్లిపెద్దగా సుమ వ్యవహరిస్తోందన్న మాట. ఇక ఈ షో కోసం ఈమె తీసుకునే పారితోషికం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

దాదాపు 3నెలలకు పైగా జరగబోయే ఈ షో కోసం ఒక్కో ఎపిసోడ్ కి సుమ అక్షరాలా లక్షా 50వేల రూపాయలను అందుకుంటున్నట్లు బోగట్టా. ఇక హిందీలో రాహుల్ కి దునియా,రాఖీ కా స్వయంవరం వంటి షో లు అలాగే తమిళంలో ఆర్యతో యంగవీటి మా పిళ్ళై పేరుతొ విజయవంతమైన ఇలాంటి షో లు విజయవంతం అయ్యాయి. అందుకే తెలుగులో కూడా రొటీన్ సీరియల్స్, ప్రోగ్రామ్స్ కి భిన్నంగా పెళ్లిచూపులు సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.