సుమ సినిమా రీ ఎంట్రీ.. నిజం ఏంటో తేలిపోయింది

తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుమ అనే పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెద్ద ఎత్తున ఆమె షో లు టీవీల్లో వస్తూనే ఉన్నాయి.

 Anchor Suma Reentry In Movie Very Coming Days  Details, Anchor Suma, Sumar Re En-TeluguStop.com

టీవీ పెడితే చాలు ఏదో ఒక ఛానెల్‌ లో ఆమె సందడి కనిపిస్తూ ఉంటుంది.ఇక పెద్ద హీరోల సినిమాల వేడుకలు ఉంటే ఖచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే.

సుమ లేకుంటే మరే హోస్ట్ తో చేయించినా కూడా ఆ కార్యక్రమం పెద్దది అవ్వదు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయంగా మారింది.అంతలా సుమ పేరు దక్కించుకున్నారు.

సుమ చాలా కాలం నుండి బుల్లి తెరకు పరిమితమై ఉన్నారు.గతంలో సుమ వెండి తెరపై కూడా సినిమాలు చేసిన విషయం చాలా మందికి తెల్సిందే.

బుల్లి తెరపై బిజీ అవ్వడం వల్ల వెండి తెరను ఆమె దూరం పెట్టారు.అప్పుడప్పుడు మెరిసినా కూడా ఆమె పూర్తి స్థాయిలో మాత్రం వెండి తెరపై కనిపించలేదు.

ఎట్టకేలకు మళ్లీ సుమ వెండి తెరపై కనిపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది.చాలా మంది అడిగినట్లుగా.కోరుకున్నట్లుగా ఖచ్చితంగా నేను సినిమా ల్లో నటించాలని అనుకున్నాను.అది ఎప్పుడు ఏంటీ అనేది త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాను అంటూ ఒక ఫన్నీ వీడియో ద్వారా తన రీ ఎంట్రీ గురించి విషయాన్ని తెలియజేసింది.

Telugu Anchor Suma, Suma, Suma Lady, Sumar, Tollywood-Movie

సుమ ఏ సినిమా లో నటించబోతుంది.ఎవరితో నటించబోతుంది.ఎలా నటించబోతుంది అనే విషయాలను త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు.సుమ హీరోయిన్‌ గా సెట్‌ అవ్వదు.అలా అని హీరోలకు అమ్మ పాత్రలు చేస్తుందని అనుకోవడం లేదు.కనుక ఖచ్చితంగా ఒక మంచి లేడీ ఓరియంటెడ్‌ సినిమా ను ఆమె చేస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సుమ ఏం చేసినా కూడా సంచలనం గా ఉండటం ఖాయం.కనుక సినిమా ఎంట్రీ తో సుమ మళ్లీ రెచ్చి పోవడం ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube