టాలీవుడ్ సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ నటుడిగా రాజీవ్ కనకాల మంచి పేరును సొంతం చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో ఉప్పెన సినిమాలో రాజీవ్ కనకాల నటన బాగుందని ప్రశంసలు వచ్చాయి.
మరోవైపు రాజీవ్ కనకాల భార్య, బుల్లితెర యాంకర్ సుమ వరుస షోలతో బిజీగా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల తన ప్రేమ కథ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సుమను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఛాన్స్ లేదని రాజీవ్ కనకాల అన్నారు.1994లో ఒక పైలట్ ఎపిసోడ్ ను డైరెక్ట్ చేసి ఆ ఎపిసోడ్ రషెస్ ను త్రీ స్టార్ ఎలక్ట్రానిక్స్ అనే స్టూడియోకు ఎడిటింగ్, డబ్బింగ్ కోసం తీసుకెళ్లానని మీర్ గారికి హలో చెబుతామని వెళ్లిన సమయంలో సుమను తొలిసారి చూశానని రాజీవ్ అన్నారు.అమ్మాయి ఎవరో బాగానే ఉందని సుమను చూసి అనుకున్నానని రాజీవ్ చెప్పారు.
1991 నుంచి సుమ ఇండస్ట్రీలో ఉన్నా తాను 1994లో ఆమెను చూశానని రాజీవ్ చెప్పారు.జీకే మోహన్ గారి డైరెక్షన్ లో తనకు, సుమకు కాంబినేషన్ లో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారని ఆ ఎపిసోడ్ ఒకరోజు మాత్రమే ఉండటంతో ఫీలయ్యానని రాజీవ్ చెప్పుకొచ్చారు.ఒకరోజు షూటింగ్ ఊహించని విధంగా పొడిగించారని రాజీవ్ కనకాల తెలిపారు.
ఆ తర్వాత జీవనరాగం సీరియల్ లో తాను పెళ్లికొడుకునని ఒక ఆర్టిస్ట్ నో చెప్పడంతో సుమను పెళ్లికూతురుగా తీసుకొచ్చారని చెప్పారు.
ఆ తర్వాత నాన్న డైరెక్షన్ లో తెరకెక్కిన సీరియల్ లో సుమది లీడ్ రోల్ అని ఆ సమయంలో సుమను పడేశానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.ఎవరైనా మొదట నో చెబుతారని తాను గబగబా కన్నీళ్లు పెట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత తాను షూటింగ్ కు వెళ్లానని సుమకు ఆ సమయంలో కారు లేకపోవడంతో ఆమె రాజీవ్ కారులో వెళ్లిపోతానని చెప్పిందని అలా మా జర్నీ మొదలైందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.