యాంకర్స్‌ సుమ, శ్రీముఖి కలిసి ఏం చేయబోతున్నారో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  

Anchor Suma Plans A New Tv Show With Anchor Srimukhi - Telugu Anchor Srimukhi, Anchor Suma, New Tv Show, Suma Productions, Suma Rajeev Creations

తెలుగు బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన ఇంకా చేస్తూనే ఉన్న యాంకర్స్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో ఉండే పేర్లు సుమ మరియు శ్రీముఖి.వీరిద్దరు కూడా స్టేజ్‌పై కనిపిస్తే సందడి, షోలో కనిపిస్తే టీఆర్పీ రేటింగ్‌.

Anchor Suma Plans A New Tv Show With Anchor Srimukhi

ఇలా దుమ్ము దుమ్ముగా దులిపేస్తూ వీరిద్దరు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.వీరిద్దరు విడి విడిగా ఉంటేనే సందడి మామూలుగా ఉండదు.

అలాంటిది వీరిద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

యాంకర్స్‌ సుమ, శ్రీముఖి కలిసి ఏం చేయబోతున్నారో తెలిస్తే ఎగిరి గంతేస్తారు-Movie-Telugu Tollywood Photo Image

సుమకు సొంత ప్రొడక్షన్‌ ఉన్న విషయం తెల్సిందే.

ఆ ప్రొడక్షన్‌లో ఒక షోను ప్రారంభించబోతున్నారు.ఆ షో కోసం శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించబోతుంది.

సుమ బ్యాక్‌లో ఉండి మద్దతుగా ఉంటుందో లేదంటే శ్రీముఖితో కలిసి స్టేజ్‌పై కనిపిస్తుందో చూడాలి.బిగ్‌బాస్‌ తర్వాత శ్రీముఖి క్రేజ్‌ మరింత పెరిగింది.

ఆమె రన్నర్‌గా నిలిచినా విన్నర్‌కు ఏ స్థాయిలో పబ్లిసిటీ దక్కుతుందో, ఆహ్వానం లభిస్తుందో అదే స్థాయిలో ఆమెకు కూడా దక్కింది.

సుమ ప్రొడక్షన్‌లో ఇప్పటికే చాలా షోలు వచ్చాయి.కాని ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు గట్టిగా సక్సెస్‌ కాలేదు.ప్రస్తుతం సుమ చేస్తున్న ఎఫ్‌ 2 కూడా అంతగా క్లిక్‌ అవ్వలేదు.

దాంతో శ్రీముఖితో సుమ ఒక షోను ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తుంది.ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో ఈ షో ప్రసారం కాబోతుంది.

అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ షో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.

వీరిద్దరు కలిస్తే డబుల్‌ సెన్షేషన్‌ ఖాయం అంటూ చాలా నమ్మకంగా ప్రేక్షకులు ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test