ఆ షో నుంచి యాంకర్ సుమ తప్పుకున్నారా..?

బుల్లితెరపై మోస్ట్ సక్సెస్ ఫుల్ యాంకర్ గా సుమ పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సుమ యాంకర్ గా చేసిన షోలలో ఎక్కువ షోలు హిట్ అయ్యాయి.

 Anchor Suma May Quit Big Celebrity Challenge Show,latest Tollywood-TeluguStop.com

ప్రస్తుతం ఈటీవీలో క్యాష్, స్టార్ మా ఛానెల్ లో స్టార్ట్ మ్యూజిక్, జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోలకు సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ మూడు షోలు మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో పాటు సుమ యాంకరింగ్ కు సైతం మంచి పేరు వస్తుండటం గమనార్హం.

అయితే తాజాగా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో సుమ కనిపించలేదు.రవితో కలిసి సుమ ఈ షో చేస్తుండగా రవి మాత్రమే ఈ వారం ప్రోమోలో కనిపించారు.అయితే సుమ ఈ వారం మాత్రమే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోలో కనిపించరా.? లేక పర్మినెంట్ గా సుమ ఈ షోకు దూరమయ్యారా.? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అయితే ఈ ప్రశ్నలకు సుమ స్పందిస్తే మాత్రమే జవాబు తెలిసే అవకాశం ఉంది.

అయితే లాక్ డౌన్ రూల్స్ వల్ల సుమ ఈ షోకు హాజరు కాలేదని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ షోకు గెస్ట్ గా సద్దాం ఎంట్రీ ఇవ్వగా డ్రామా జూనియర్స్ షోలో పాల్గొనే పిల్లలు హాజరయ్యారు.

పిల్లలు పంచ్ లు వేయగా సద్దాం బాలయ్యను ఇమిటేట్ చేస్తూ పేల్చిన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే సుమ ఉంటే ప్రోమో మరింత బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చాలా వారాల నుంచి ప్రసారమవుతున్న ఈ షోలో సుమ యాంకర్ గా లేకుండా మొదటిసారి ప్రోమో రిలీజ్ కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube