షూటింగులు లేకపోవడంతో అలా చేస్తున్న సుమ.... దాంతో నెటిజన్లు...

షో ఏదైనా, ఈవెంట్ ఏదైనా తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ “సుమ కనకాల” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో యాంకర్ సుమ పలు చిత్రాలలో కూడా నటించింది.

 Anchor Suma Makeup Funny Video Viral, Anchor, Suma, Rajeev Kanakala, Sye Movie,-TeluguStop.com

కానీ ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కానీ యాంకరింగ్ రంగంలో మాత్రం తిరుగులేని మహారాణిగా కొనసాగుతోంది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు నిలిపివేయడంతో సుమ కనకాల సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది.

కాగా తాజాగా సుమ కనకాల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వీడియో ఏముందంటే గతంలో తన భర్త రాజీవ్ కనకాల నటించిన సై చిత్రంలోని ఓ డైలాగుని చెబుతూ గెలవాలనే సంకల్పం ఉంటే కచ్చితంగా గెలుస్తామని కాబట్టి ఈ కరోనా విపత్కర సమయంలో కూడా ఓర్పుతో ఉంటే కచ్చితంగా ఈ సంకటాన్ని కూడా దాటేస్తామని ధైర్యం చెప్పింది.అలాగే గత కొద్ది రోజులుగా సినిమా షూటింగులు లేకపోవడంతో తన మేకప్ కిట్లు పాడైపోయే దశకు చేరుకున్నాయని దాంతో అప్పుడప్పుడు తానే సినిమా షూటింగులో లేకపోయినప్పటికీ మేకప్ వేసుకుని ఆ తర్వాత మొహం కడిగేసుకుంటానని సరదాగా అందరినీ నవ్వించింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ సుమ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో” ప్రోగ్రాంలో యాంకర్ గా వ్యవహరిస్తోంది.అంతే కాకుండా అప్పుడప్పుడు పలు యూట్యూబ్ వీడియోలతో కూడా ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube