70 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ తల్లి షాకింగ్ పని.. వైరల్ వీడియో!

తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ సుమ.తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.బుల్లితెర యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఎన్నో షో లలో యాంకరింగ్ చేస్తూ బిజీ లైఫ్ లో గడుపుతుంది సుమ.అంతేకాకుండా ఎన్నో సినిమాల ఈవెంట్స్ లలో తన యాంకరింగ్ లతో ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.సుమ వెండితెరలో నటించగా.

 Anchor Suma Kanakala Shares Her Mother Fitness Video Facebook-TeluguStop.com

అంత సక్సెస్ ను తెచ్చుకోలేదు కానీ బుల్లితెర లో మాత్రం సుమ అంటే ఇక మాటల్లో చెప్పలేనిదే.

ఇదిలా ఉంటే సుమ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Anchor Suma Kanakala Shares Her Mother Fitness Video Facebook-70 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ తల్లి షాకింగ్ పని.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన కుటుంబానికి సంబంధించిన విషయాలు అతి తక్కువగా పంచుకునే సుమ.తాజాగా తన తల్లికి సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఆ వీడియో చూసిన నెటిజనులు నోటి మీద వేలు వేసుకుంటున్నారు.ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.సుమ వాళ్ళ అమ్మ వయసు 70 ఏళ్లు.ఇక ఆమె చేసే వ్యాయామం, కసరత్తులు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

ఇక ఈ వీడియోకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతున్న సుమ.ఏ వయసులో అయినా అందరూ శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం ఉందని సుమ భావిస్తుందట.

అంతే కాదు ఆ మాటకి గొప్ప ఉదాహరణ తన తల్లి అని చెబుతుంది.ఇంత వయసులో కూడా ఆమె ఎనర్జీ గా ఉన్నారని.దానికి కారణం ఆమె ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవడం అంటూ తెలిపింది సుమ.ఇక ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందని.ఆమె అమ్మ ముద్దు పేరు బేబీ అంటూ తెలిపింది.ఇక ఈ వీడియో ప్రతి కుటుంబానికి తమని తాము ఆరోగ్యంగా చేసుకునే ప్రతి గొప్ప తల్లులకు అంకిత మంటూ పంచుకుంది సుమ.