యాంకర్ సుమకు అంత పెద్ద జబ్బు ఉందా.. ఇన్నాళ్లు ఎలా భరించిందో?

తెలుగు బుల్లితెర పై సుమ కనకాల ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.బుల్లి తెరపై కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో సందడి చేసిన ఆ తర్వాత యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టారు.

 Anchor Suma, Skin Disease, Tollywood, Youtube Channel , Anchor Suma, Skin Deasea-TeluguStop.com

తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగును ఎంతో స్పష్టంగా అనర్గళంగా మాట్లాడుతూ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో సినిమా ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న యాంకర్ సుమ నటుడు రాజీవ్ కనకాలని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సుమ తెరపై ఎంతో సందడిగా అందరి పై జోకులు వేస్తూ ఎంతో సరదాగా ఆట పట్టించే సుమ గత కొంతకాలం నుంచి ఒక పెద్ద జబ్బుతో బాధ పడుతున్నారు.అయితే ఈ విషయం గురించి ఇన్ని రోజులు బయట పెట్టకపోయినా తాజాగా తాను ఇబ్బంది పడుతున్న వ్యాధి గురించి సుమ బయటపెట్టారు.

బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Telugu Anchor Suma, Skin, Tollywood, Youtube Channel-Movie

ఈ క్రమంలోనే సుమ మాట్లాడుతూ గత కొంత కాలం నుంచి ఒక విషయాన్ని దాచి పెట్టాను.అయితే ఇకపై ఆ విషయాన్ని దాచి పెట్టాలనుకోవడం లేదంటూ తను ఒక రకమైన చర్మ వ్యాధితో బాధ పడుతున్న విషయాన్ని బయటపెట్టారు.సుమ కీలాయిడ్‌ టెండెన్సీ అనే చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు.

కీలాయిడ్‌ టెండెన్సీ అంటే చర్మం పై ఒకచోట గాయం అయితే ఆ గాయం మరింత పెద్దదిగా మారి చుట్టుపక్కల మొత్తం వ్యాపిస్తుంది.దీన్ని నయం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

అయితే ఇలా ప్రయత్నాలు చేసిన తగ్గని జబ్బుల గురించి దాచడం కన్నా అది ఎప్పుడు మనతోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దానిని అంగీకరించక కలిగితేనే ఎంతో సంతోషంగా జీవించగలమని ఈ సందర్భంగా సుమ తన పడుతున్న చర్మ సమస్య గురించి బయట పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube