ఒక ఈవెంట్ కు యాంకర్ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతొందీ యాంకర్ సుమ.

 Anchor Suma Kanakala Remuneration And Conditions,  Anchor Suma, Remuneration, Ev-TeluguStop.com

ఇటు వెండితెర పై అటు బుల్లితెర పై ఏ ఈవెంట్, ఏ సినిమా ఫంక్షన్ లో చూసినా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉంటుంది.యాంకర్ సుమ తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.

ఒకవైపు ఈవెంట్ లు,షూటింగ్ లు అంటూ బిజీబిజీగా ఉంటేనే తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువగా ఉంటుంది.

యాంకర్ సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడి ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలిసిందే.సినిమాకు సంబంధించిన ఈవెంట్ ముఖ్యంగా దర్శక నిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చు.

వేరే వాళ్లని యాంకర్లకు పెట్టుకుంటే.ఈవెంట్‌ని ఎలా నడిపిస్తారో, ఏం మాట్లాడతారో,పెద్ద వాళ్లతో వ్యవహారం కాబట్టి పొరపాటున నోరు జారితే వాళ్లు ఎలా స్పందిస్తారో అన్న భయం ఉంటుంది.

కానీ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తోంది అంటే ఏ టెన్షన్ పడకుండా రిలాక్స్ గా ఉంటారు దర్శకనిర్మాతలు.అగ్ర దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఇష్టపడతారు.

ఇంకా చెప్పాలంటే సుమ హోస్టింగ్ కోసం ఎదురుచూస్తుంటారు అని చెప్పవచ్చు.

Telugu Anchor Suma, Tollywood-Movie

ఒకవేళ ఆమె నాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదండీ అంటే మీరు ఎప్పుడంటే అప్పుడే అనే వాళ్లు కూడా ఉన్నారంటే సుమ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.చిన్న సినిమాల సంగతి అటుంచితే పెద్ద సినిమాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు సుమ యాంకరింగ్ చేయాల్సిందే.విడుదలకు ముందు జరిగే బిగ్ ప్రమోషనల్ ఈవెంట్ కావడంతో.

సుమ హోస్టింగ్ కోసం ఎదురుచూస్తుంటారు ఈవెంట్ మేనేజర్లు.మరి ఈవెంట్ లకు హోస్ట్ గా వివారించినందుకు యాంకర్ సుమ 2నుంచి 4లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటుందట.

అంతేకాదండోయ్ సుమ యాంకరింగ్ చేయాలంటే చాలానే కండిషన్స్ ఉంటాయి.ఫస్ట్ రెమ్యునరేషన్ ఫిక్స్ కావాలి, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు నాలుగు లక్షలు రెమ్యునరేషన్ ఉంటేనే ఈవెంట్ మేనేజర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట సుమ.

Telugu Anchor Suma, Tollywood-Movie

అలాగని చివరి నిమిషంలో వచ్చి ఈవెంట్ చేయమంటే కుదరదు ఆమె డేట్స్ ముందే తీసుకోవాలి.కనీసం పది రోజులు ముందైనా డేట్ ఫిక్స్ చేసుకోవాలి.ఇక వరుస సినిమాలప్పుడైతే సుమ డేట్స్ దొరకడం ఈవెంట్ మేనేజర్స్‌కి పెద్ద పనే.అయితే రెమ్యూనరేషన్ నాలుగు లక్షల తీసుకున్నప్పటికి సుమ హోస్ట్ నిర్వహించే మాత్రం కేవలం రెండు గంటలే.స్టేజిపై ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా రెండు గంటల అయిపోయిన తర్వాత ఆమె కారు వెక్కి వెళ్లి పోతుందట.అలాగే ఈవెంట్ కు సుమతో పాటు మరో కో యాంకర్‌ని పెట్టుకోవాల్సిందే.

ఈవెంట్ మొదట్లో యాంకర్ వచ్చి కొద్దిసేపు హోస్టింగ్ చేసి వెళ్లగా మధ్యలో సుమ వచ్చి జాయిన్ అవుతుంది.అలాగే ఈవెంట్‌ని గంటలు గంటలు నడిపించాలంటే సుమకు దగ్గర కుదరదట.

స్పీచ్‌లు అన్నీ అవ్వాలి.శుభం కార్డ్ సుమే వేయాలంటే అస్సలు కుదరదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube