జబర్దస్త్ లోకి సుమ గ్రాండ్ ఎంట్రీ.. నవ్వులే నవ్వులు!

బుల్లితెర స్టార్ యాంకర్లలో అత్యంత బిజీగా ఉండే యాంకర్ ఎవరంటే సుమ కనకాల అనే చెప్పాలి.ఈ ఛానల్, ఆ ఛానెల్ అనే తేడాల్లేకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలోనూ సుమ సందడి చేస్తూ ఉంటుంది.

 Anchor Suma Kanakala Grand Entry In Jabardasth Show, Anchor Suma, Jabardasth Sho-TeluguStop.com

కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగడం లేదు కానీ లేకపోతే ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్లతో సుమ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేది.బుల్లితెర యాంకర్లలో ఎక్కువ పారితోషికం తీసుకునే యాంకర్ కూడా సుమనే కావడం గమనార్హం.

కొన్ని రోజుల క్రితం అదిరింది షోలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సుమ ఈసారి జబర్దస్త్ షోలో కనిపించింది.ఈ నెల 23వ తేదీన జరగబోయే ఎక్స్ట్రా జబర్దస్ట్ షోలో సుమ సందడి చేయబోతుంది.

అయితే సుమ జబర్దస్త్ సెట్ లోకి అడుగుపెట్టకుండానే కనిపించనుండటం గమనార్హం.జబర్దస్ స్కిట్ లో భాగంగా కెవ్వు కార్తీక్, ఇమ్మాన్యువల్ స్కిట్ చేశారు.

ఆ స్కిట్ లో వీళ్లు భార్యాభర్తల పాత్రలు పోషించారు.

అందులో భార్యకు స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని కోరిక.

భార్య భర్తను కొట్టుకుంటూ స్టార్ మహిళ సెట్ కు తీసుకెళుతుంది.అక్కడ సుమ “ఏంటి కార్తీక్ నువ్వా.? ఆశీర్వాదం కావాలంటే ఇచ్చేదాన్ని కదా.ఇలా కాళ్ల మీద పడాలా.?” అంటుంది.ఏంటీ నీ ప్రాబ్లమ్ అని సుమ అడగగా “నా భార్యే నాకు ప్రాబ్లమ్” అని కార్తీక్ చెబుతాడు.

సుమ వెంటనే “రోజాగారూ.! ఏదో ప్రాబ్లమ్ అంట.ఒకసారి అటు పంపిస్తున్నాను.కొంచెం చూసుకోరా” అంటుంది.

రోజా వెంటనే ఆ సమస్య నా షోలో తీరదని మీ షోలోనే తీరుతుందంటూ జవాబిస్తుంది.ఆ తర్వాత రష్మీ కూడా స్టార్ మహిళ సెట్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

రష్మీ సుమను “మీరు నుంచుని నుంచుని అలసిపోరా.ఏదో ఒక సోఫా పెట్టుకుని కూర్చోవచ్చు కదా.?” అని చెప్పగా సుమ “గ్యాప్ ఇస్తే మీరు వచ్చి నుంచుంటారు” అంటూ సెటైర్ వేస్తుంది.మొత్తానికి ఈ వారం సుమ జబర్దస్త్ షోలో కనిపిస్తూ నవ్వులపువ్వులు పూయించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube