సెట్ లో ఆ పని చేసిన సుమ.. ఫిదా అయిన నెటిజన్లు..?  

anchor suma kanakala funny comments on her latest post,tollywood news - Telugu Anchor Suma Kanakala, Cash Program, Funny Comments, Latest Post

బుల్లితెర యాంకర్ సుమ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సుమ సోలోగా యాంకరింగ్ చేసిన చాలా షోలు బుల్లితెరపై సక్సెస్ అయ్యాయి.

TeluguStop.com - Anchor Suma Kanakala Funny Comments On Her Latest Post

సంవత్సరాలు గడుస్తున్నా సుమ హవా అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.సుమ ప్రస్తుతం ఈటీవీలో క్యాష్ తో పాటు స్టార్ మా ఛానెల్ లో స్టార్ మ్యూజిక్, జీ తెలుగు ఛానల్ లో రవితో కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోను హోస్ట్ చేస్తున్నారు.

సుమ స్పాంటేనియస్ గా వేసే పంచ్ లు, అనర్గళంగా తెలుగు మాట్లాడే తీరు, హుందాగా చేసే యాంకరింగ్ ఆమెను టాప్ యాంకర్ గా చేశాయి.సినిమాల ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సైతం ఎక్కువమంది దర్శకనిర్మాతలు సుమకే యాంకర్ గా అవకాశాలు ఇస్తారు.

TeluguStop.com - సెట్ లో ఆ పని చేసిన సుమ.. ఫిదా అయిన నెటిజన్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎప్పుడూ సరదాగా ఉండే సుమ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో సుమ బ్లూ కలర్ లంగాఓణీలో మెరిశారు.

ఆ వీడియోలో క్యాష్ ప్రోగ్రామ్ సెట్ లో సుమ గిరగిరా తిరుగుతున్నారు.అలా గిరగిరా తిరుగుతూ ఫ్లోర్ ను ఎలా క్లీన్ చేయాలనే విషయానికి సంబంధించి తాను సరికొత్త పద్ధతిని కనుగొన్నానని ఆమె అన్నారు.

ఆమె ఫన్నీగా చెప్పిన విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.సెట్లో పనివాళ్లు ఉన్నా వేగంగా ఈ విధంగా ఫ్లోర్ ను క్లీన్ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

పోస్ట్ తో పాటు ఎమోజీలను కూడా సుమ షేర్ చేశారు.

ఈ పోస్ట్ ను చూసిన కొందరు నెటిజన్లు ఇలా కూడా ఫ్లోర్ ను క్లీన్ చేయవచ్చా అని ప్రశ్నిస్తున్నారు.

సుమ ఎంతో యాక్టివ్ గా ఉండటంతో పాటు ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

#AnchorSuma #Funny Comments #Cash Program

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు