ఇంటి నుంచే డబ్బులు సంపాదిస్తున్న సుమ.. ఎలా అంటే..?

కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకరింగ్ కు పూర్తిగా సుమ పరిమితమయ్యారు.తన వాక్చాతుర్యంతో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సుమకు సంవత్సరాలు గడుస్తున్నా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

 Anchor Suma Kanakala Advertising Products From Home-TeluguStop.com

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోల ద్వారా రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ గా సుమ పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే.

షూటింగ్ లపై సైతం ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సుమ సైతం ఇంటికే పరిమితమయ్యారు.ఈ మధ్య కాలంలో యాడ్స్ లో కూడా కనిపిస్తున్న్ సుమ తాజాగా ఇంటి నుంచి కూడా ప్రాడక్ట్ లను ప్రమోట్ చేశారు.

 Anchor Suma Kanakala Advertising Products From Home-ఇంటి నుంచే డబ్బులు సంపాదిస్తున్న సుమ.. ఎలా అంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా సుమ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.తరచూ ఏదో ఒక వీడియోను షేర్ చేసే సుమ ఆ వీడియోల ద్వారా నెటిజన్లకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

బుల్లితెరపై ఈ ఛానల్ ఆ ఛానల్ అనే డిఫరెన్స్ లేకుండా అన్ని ఛానెళ్లలో సుమ యాంకర్ గా చేస్తున్న ప్రోగ్రామ్ లు ప్రసారమవుతున్నాయి.ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే సుమ తనపై ఏవైనా విమర్శలు వస్తే వెంటనే స్పందించి ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఉంటారు.సుమక్క పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ ను కలిగి ఉన్న సుమ ఆ ఛానల్ లో కొన్ని నెలల క్రితం వరకు వీడియోలను అప్ లోడ్ చేశారు.

తాజాగా ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఒక వీడియోను షేర్ చేసిన సుమ ఒక కంపెనీని ప్రమోట్ చేశారు.

వేడివేడి ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేయడంతో పాటు ఒక కంపెనీకి సంబంధించిన పొడులను సైతం సుమ ప్రమోట్ చేశారు.సోషల్ మీడియాలో ప్రాడక్ట్ లను ప్రమోట్ చేస్తూ సుమ భారీ మొత్తంలో సంపాదిస్తుండటం గమనార్హం.

#Suma Kanakala #Earning Money #From Home

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు