రవి పరువుతీసిన సుమ.. పెళ్లి మ్యాటర్ దాచిపెట్టాడంటూ..?  

anchor suma interesting comments about ravi marriage, anchor suma, anchor ravi, big celebrity challenge, zee tv, anchor ravi marriage, promo - Telugu Anchor Ravi, Anchor Ravi Marriage, Anchor Suma, Big Celebrity Challenge, Interesting Comments, Promo, Ravi Marriage, Ravi Punches About Suma, Zee Tv

బుల్లితెర ఫిమేల్ యాంకర్లలో సుమ, బుల్లితెర మేల్ యాంకర్లలో రవి తమ యాంకరింగ్ ద్వారా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే.వీళ్లిద్దరు కలిసి జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ను చేస్తున్నారు.

TeluguStop.com - Anchor Suma Insulted Ancor Ravi On His Marriage

తాజాగా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఐదో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమోలో సుమ రవి పెళ్లి గురించి అదిరిపోయే పంచ్ లు వేశారు.

మా మ్యూజిక్ లో ఒక ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రవి తనకు పెళ్లైన విషయాన్ని వెల్లడించలేదు.

TeluguStop.com - రవి పరువుతీసిన సుమ.. పెళ్లి మ్యాటర్ దాచిపెట్టాడంటూ..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే అతనికి పెళ్లైందని ఒక పాప కూడా ఉందని జోరుగా ప్రచారం జరిగేది.యాంకర్ రవికి కూడా పలు సందర్భాల్లో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యేవి.కానీ రవి పెళ్లికి సంబంధించి స్పందించేవారు కాదు.అయితే ఆ తరువాత ఒక సందర్భంలో పెళ్లి గురించి రవి స్పష్టతనిచ్చారు.

తన భార్య, కూతురుతో ఉన్న ఫోటోలను కూడా రవి షేర్ చేశారు.తాజాగా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోమో విడుదల కాగా సీరియల్ నటులు పవన్, తనూజ వచ్చారు.సుమ రవిని లైఫ్ లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ చెప్పాలని అడగగా రవి వెంటనే మ్యారేజ్ అని చెప్పారు.సుమ వెంటనే కొన్నేళ్లు మ్యారేజ్ ను దాచిపెట్టడం ఒక ఛాలెంజ్ అని, తరువాత బయటపెట్టడం మరో ఛాలెంజ్ అని చెప్పుకొచ్చారు.

రవి మ్యారేజ్ అతనికి ఛాలెంజ్ కాదని మాకు ఛాలెంజ్ అంటూ సుమ పంచ్ లు వేశారు.నేను యూట్యూబ్ లో కామెంట్స్ 500 పెట్టాను మొన్న అని రవి చెప్పగా సుమ నా వీడియోల కింద ఛండాలమైన కామెంట్లు పెట్టేది నువ్వేనా.? అని అడుగుతాడు.రవి వెంటనే తడుముకోకుండా నీ వీడియోల కింద జై సుధీర్ అన్న అని కామెంట్లు పెట్టేది తనేనని తెలిపారు.

జనవరి 24వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

#Anchor Suma #AnchorRavi #Ravi Marriage #BigCelebrity #Promo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు