సీనియర్ యాంకర్ సుమకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.సుమ యాంకర్ గా చేసిన షోలలో దాదాపు ఆన్ని షోలు సక్సెస్ అయ్యాయి.
అయితే సుమ గత కొన్నిరోజుల నుంచి ఒక షో విషయంలో ప్రేక్షకులను సస్పెన్స్ లో పెడుతున్నారు.ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ప్రేక్షకులను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా సుమ ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సుమ తన ముఖంపై వైట్ క్లాత్ వేసుకుని ఉన్నారు.సుమ నేనేం చెబుతున్నాను అంటే అని స్టార్ట్ చేయగా వెనుక నుంచి అమ్మగారూ ఇంకా 3 డేస్ ఉంది అనే వాయిస్ వినిపిస్తుంది.సుమ వెంటనే విన్నారు కదా ఇంకా చెప్పడానికి మూడు రోజులుందంటూ ముఖంపై క్లాత్ వేసుకున్నారు.
అయితే మూడు రోజుల తర్వాత సుమ ఏం చెప్పబోతున్నారనే విషయం మాత్రం ప్రేక్షకులకు ఏ మాత్రం అర్థం కావడం లేదు.
సుమ గతంలో ఎప్పుడూ ఇలా ప్రేక్షకులను సస్పెన్స్ లో పెడుతూ వీడియోలు చేయలేదు.దీంతో సుమ ఏ విషయం గురించి చెప్పబోతున్నారో అనుకుంటూ ప్రేక్షకులు తెగ టెన్షన్ పడుతున్నారు.జులై 1వ తేదీన సుమ కొత్త షోకు సంబంధించిన ప్రకటన చేస్తారా.? లేక తన కొడుకు సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తారా.? లేక మరేదైనా కొత్త విషయం గురించి చెబుతారా.? చూడాల్సి ఉంది.దీంతో నెటిజన్లు చేసిందంతా చేసి ఇదేం పని సుమ అని కామెంట్లు చేస్తున్నారు.
మిగతా యాంకర్లలా సుమ కూడా ప్రేక్షకులను సస్పెన్స్ లో పెడుతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.యంగ్ యాంకర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా సుమ మాత్రం స్టార్ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.