ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ సుమ  

anchor suma entry in OTT, Aha APP, Digital Entertainment, OTT Platform, Allu aravind, - Telugu Aha App, Allu Aravind, Anchor Suma Entry In Ott, Digital Entertainment, Ott Platform

తెలుగు టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ ని యాంకర్ సుమ సొంతం చేసుకుంది.ఎప్పుడో దశాబ్దం క్రితం యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సుమ తన మాటల గారడీతో ఇప్పటికి ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది.

TeluguStop.com - Anchor Suma Entry In Ott

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

చాలా షోలు కేవలం యాంకర్ సుమ కోసమే టీవీ ప్రేక్షకులు చూస్తారంటే అతిశయోక్తి కాదు.ప్రస్తుతం రియాలిటీషోలలోకి కొత్త కొత్త భామలు యాంకర్ లు గా ఎంట్రీ ఇచ్చి తమ హాట్ స్కిన్ షో తో గ్లామర్ తీసుకొచ్చారు.

TeluguStop.com - ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ సుమ-Movie-Telugu Tollywood Photo Image

ప్రేక్షకులు కూడా ఇలాంటి గ్లామర్ యాంకర్స్ ని చూడటానికి ఇష్టపడుతున్నారు.ఇలాంటి వాతావరణంలో కూడా కేవలం తమ మాటల చాతుర్యంతోనే అందరికంటే ఎక్కువ షోలు చేస్తూ యాంకర్ సుమ నెంబర్ వన్ యాంకర్ గా తన తిరుగులేని ప్రస్తానం కొనసాగిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి డిమాండ్ విపరీతంగా పెరిగింది.

ఈ నేపధ్యంలో ఒటీటీ చానల్స్ కొత్త కొత్త కాన్సెప్ట్ తో షోలని డిజైన్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకు టెలివిజన్ ని రూల్ చేసిన యాంకర్ సుమర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతుంది.అల్లు అరవింద్ ఆహా ఒటీటీలో సరికొత్త కాన్సెప్ట్ తో ఒక రియాలిటీ గేమ్ షోని ప్లాన్ చేశారు.

ఇవి కూడా ఎపిసోడ్స్ గానే రిలీజ్ అవుతాయి.ఈ షోలకి యాంకర్ గా సుమని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ షోకి సంబంధించి ఈ రోజు ఐదు గంటలకి బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది.ఆహా పేస్ బుక్ పేజీ ద్వారా ఆమె లైవ్ లోకి వచ్చి షోగురించి చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

మరి ఆమె ఒటీటీలో చేయబోయే షో ఎలా ఉండబోతుంది, ఎలాంటి కాన్సెప్ట్ తో ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

#AnchorSuma #Allu Aravind #Aha App #OTT Platform

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Suma Entry In Ott Related Telugu News,Photos/Pics,Images..