నిద్రపోనివ్వకుండా ఆ జంతువును టార్చర్ చేసిన సుమ?

బుల్లితెర యాంకర్లలో యాంకర్ సుమకు ఉండే క్రేజే వేరు.ఈ ఛానల్, ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా సుమ షోలతో ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు.

 Anchor Suma Disturbing Sleeping Dog, Suma , Zorro Dog, Viral Video, Suma Playing-TeluguStop.com

టీవీ షోలు మాత్రమే కాకుండా ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ ఈవెంటలకు నిర్వాహకులు సుమనే యాంకర్ గా తీసుకుంటారు.బుల్లితెర యాంకర్లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ గా సుమకు పేరుంది.

ఎప్పుడూ బిజీగా ఉండే సుమ కు కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే పనిభారం కొంత తగ్గింది.

ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న సుమ తాజాగా కుక్కను నిద్ర లేపుతూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంట్లో పడుకున్న జోరోను మొదట పెన్నుతో కదిలించింది.కుక్క లేచి చూసే సరికి సుమ సైలెంట్ అయింది.మళ్లీ అదే పనిగా కుక్కను పెన్నుతో లేపడానికి ట్రై చేసింది.అయినా జోరో కదలకపోవడంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ కుక్కపై బాలును విసిరింది.

అయితే కుక్క ఏ మాత్రం చలనం లేకుండా పడుకుంది.దీంతో సుమ కుక్క “జోరో లే, జోరో లే” అంటూ ఆ కుక్కను నిద్ర లేపేసింది.సుమ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయగా నెట్టింట ఈ వీడియో హల్చల్ చేస్తోంది.చక్కగా పడుకున్న కుక్కను సుమ లేపడంతో నెటిజన్లు సుమ జోరోను టార్చర్ చేసిందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

కొందరు నెటిజన్లు సుమ తన శాడిజాన్ని బయటపెట్టిందని కామెంట్లు చేస్తున్నారు.

సుమ జోరోను భయపెట్టడం ఇదే తొలిసారి కాదు.

పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలైన సమయంలో సుమ రాములో రాములా పాటకు డ్యాన్స్ వేసి కుక్క బెదిరిపోయేలా చేసింది.సుమ డ్యాన్స్ చూసి కుక్క పరుగు లంకించుకుంది.

అప్పట్లో సుమ జోరోను భయపెట్టిన వీడియో వైరల్ కాగా తాజాగా కుక్క నిద్రను డిస్టర్బ్ చేసిన వీడియో సుమ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube