నిర్మాతలకు జీఎస్టీ వేస్తున్న యాంకర్

తెలుగు యాంకర్‌ అని అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు యాంకర్ సుమ.అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సమయస్ఫూర్తితో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యాంకర్ సుమ టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

 Anchor Suma Demanding Producers To Pay Gst-TeluguStop.com

ఏ సినిమా ఫంక్షన్ అయినా యాంకర్ మాత్రం సుమనే కావాలని హీరోలు పట్టుబడుతుండటం, అది సెంటిమెంట్‌గా మారడంతో ఆమెకు పెద్దమొత్తంలో రెమ్యునరేషన్‌ చెల్లిస్తున్నారు నిర్మాతలు.అయితే రెమ్యునరేష్ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకుంటున్నా, సుమ వారిని రెమ్యునరేషన్‌కు సంబంధించిన జీఎస్టీ కూడా కట్టాలని డిమాండ్ చేస్తోందట.

దీంతో నిర్మాతల జేబులకు చిల్లులు పడుతున్నట్లు వారు వాపోతున్నారు.

కానీ సినిమా రిలీజ్‌కు దగ్గరగా ఉండటం, హీరోలు రికమెండ్ చేయడంతో సుమకు ఆమె చెప్పిన మొత్తానికి రెమ్యునరేషన్‌ను ముట్టజెప్పుతున్నారు నిర్మాతలు.

కాగా కొందరు మాత్రం సుమకు బదులుగా కొత్త యాంకర్‌లకు ఆఫర్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.మరి సుమ విషయంలో ఈ ప్రచారం ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube