సినిమాల్లోకి సుమ కూతురు.. ఎంట్రీ ఎప్పుడంటే..?

సాధారణంగా పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే పిల్లలు కూడా ఆ రంగంలోకి అడుగుపెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

 Anchor Suma Daughter Entry In Tollywood Movies, Anchor Suma, Manaswini Entry In-TeluguStop.com

అయితే తల్లిదండ్రులు సక్సెస్ అయినంత మాత్రాన పిల్లలు ఆ రంగంలో సక్సెస్ అవుతారని లేదు.కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల ఇష్టాలకు, అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

బుల్లితెరపై యాంకర్ సుమ వరుస షోలతో , వెండితెరపై రాజీవ్ కనకాల వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం సుమ రాజీవ్ ల కొడుకు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు రాగా ఎట్టకేలకు ఆ వార్తలు నిజమయ్యాయి.

ఇప్పటికే రోషన్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్ కనకాల కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సుమ పిల్లలకు ఎప్పుడూ నచ్చిన పనే చేయమని చెబుతుందని రోషన్ కు హీరో కావాలనే ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి వస్తామంటే అంగీకరించామని చెప్పారు.

Telugu Anchor Suma, Manaswini, Rajiv Kanakala, Roshan-Latest News - Telugu

తమ కుటుంబంలో అందరూ నటులేనని.రోషన్ ద్వారా తమ కుటుంబం నుంచి మూడో తరం కూడా ఇండస్ట్రీలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని రాజీవ్ వెల్లడించారు.పాప మనశ్వినికి కూడా సినిమాల్లోకి ఆసక్తి ఉందని సినిమాల్లోకి పాప ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వవచ్చంటూ రాజీవ్ వ్యాఖ్యలు చేశారు.

దీంతో త్వరలో సుమ ఫ్యామిలీ నుంచి సుమ రాజీవ్ ల కూతురు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి సుమ రాజీవ్ లు వారివారి రంగాల్లో సక్సెస్ కాగా కొడుకు, కూతురు సినిమా రంగంలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

స్టార్ హీరోల వారసులు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్ కాగా ఆ సెంటిమెంట్ ను సుమ రాజీవ్ పిల్లలు బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube