ఆ షోలో ఫీలైన సుమ.. భర్త రాకపోవడంతో డిప్రెషన్ లో..?

బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన సుమ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆఫర్లతో బిజీ అవుతూ కొత్త యాంకర్లకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఎంతోమంది యాంకర్లు తాము యాంకరింగ్ రంగంలో అడుగు పెట్టడానికి సుమనే ఇన్స్పిరేషన్ అని చెబుతుండటం గమనార్హం.

 Anchor Suma Comments About Rajeev Kanakala In Start Music Show, Anchor Suma, Com-TeluguStop.com

ఎప్పుడూ చలాకీగా ఉండే సుమ ఈటీవీ, జీ తెలుగు ఛానెళ్లలో పాటు స్టార్ మా ఛానెల్ లోని స్టార్ట్ మ్యూజిక్ అనే షోకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారమవుతోంది.

సుమ ఈ షోలో చేసే సందడి అంతాఇంతా కాదు.గతంలో కొంతమంది యాంకర్లు ఈ షో చేసినా షో సక్సెస్ కాలేదు.

కానీ సుమ మాత్రం సోలో యాంకర్ గా ఈ షోను సక్సెస్ చేయడంతో పాటు మంచి రేటింగ్ లు రావడానికి కారణమవుతున్నారు.రియల్ లైఫ్ కపుల్స్ ఈ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.

జాకీ హరిత, మేఘన ఇంద్రనీల్, మధు శృతి జోడీలు ఈ షోకు గెస్ట్ లుగా వచ్చారు.

అయితే లేడీ సెలబ్రిటీలు తమ భర్తలతో రాగా సుమ మాత్రం సోలోగా ఉండటంతో రాజీవ్ కనకాల ఈ షోకు ఎందుకు రాలేదని తాను డిప్రెస్ అవుతున్నానని ఆమె తెలిపారు.సుమ సరదాగా అలా అన్నా కొందరు నెటిజన్లు మాత్రం ఏదైనా షోను సుమ రాజీవ్ కనకాల కలిసి చేస్తే బాగుంటుందని అభిప్రాయప్డుతున్నారు.ఒకరి షోలకు మరొకరు గెస్ట్ లుగా వస్తున్నా వీళ్లు కలిసి షోలు చేయడం లేదు.

భవిష్యత్తులో ఈ జంట కలిసి షోలు చేస్తారేమో చూడాల్సి ఉంది. సుమ రాజీవ్ కలిసి షో చేస్తే మాత్రం ఆ షో సూపర్ సక్సెస్ కావడం ఖాయం.

మరి సుమ రాజీవ్ కనకాల కలిసి భవిష్యత్తులో షోలు చేస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube