యాంకర్ కు కావాల్సిన లక్షణం అదేనంటున్న సుమ..!

దాదాపు 15 సంవత్సరాల నుంచి బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సుమ.కొత్త యాంకర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా సుమకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

 Anchor  Suma Comments About Anchor Qualities, Anchor Qualities, Anchor  Suma, Bi-TeluguStop.com

ఒకానొక సమయంలో ఈ ఛానల్, ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో సుమ ప్రోగ్రామ్ లు ప్రసారమయ్యాయి.గతంతో పోలిస్తే తక్కువ ప్రోగ్రామ్ లు చేస్తున్నా ఇప్పటికీ సుమనే నంబర్ 1 యాంకర్ కావడం గమనార్హం.

చాలామంది ప్రేక్షకులతో పాటు కొత్త యాంకర్లు సైతం సుమనే తమ ఫేవరెట్ యాంకర్ సుమ అనే చెబుతుంటారు.స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడం సుమ ప్రత్యేకత.

జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ప్రసారమవుతుండగా యాంకర్ రవి, సుమ కలిసి ఈ షో చేస్తున్నారు.ప్రతివారం టీవీ, సినీ ప్రముఖులు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోకు గెస్టులుగా హాజరవుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.

ఈ వారం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోకు సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్ గెస్టులుగా హాజరయ్యారు.సుమ మాట్లాడుతూ యాంకర్ కు కావాల్సిన ప్రధాన లక్షణం ఏంటో తెలుసా.? అని సుమ ప్రశ్న వేసి స్పాన్సర్స్ నేమ్స్ టకటకా చెప్పేయటమే యాంకర్ కు కావాల్సిన ప్రధాన లక్షణమని ఆమెనే చెప్పారు.రవిని చెప్పమని సుమ అడగగా రవి చెప్పలేకపోయారు.

గెటప్ శ్రీను చెప్పడానికి ప్రయత్నం చేసినా అతను కూడా చెప్పలేకపోయాడు.

అయితే సుమ, రవి కలిసి హోస్ట్ లుగా చేస్తున్నా ఈ ప్రోగ్రామ్ కు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు ఐతే రావడం లేదని తెలుస్తోంది.

మరోవైపు సుమ ఈటీవీలో పలు ప్రోగ్రామ్ లకు యాంకర్ గా చేయడంతో పాటు సుమక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube