యాంకర్ల మొగుళ్లకి మాట్లాడే అవకాశం దొరకదు..!

యాంకర్ అంటే ఫీమేల్సే అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు మన బుల్లితెర భామలు.దశాబ్ధాలుగా సుమ స్మాల్ స్క్రీన్ పై చేస్తున్న హంగామా తెలిసిందే.ఆమె ఎనర్జీకి, సమయస్పూర్తికి ఎవరు సాటిలేరు అనేంతగా ఉంటుంది.అందుకే ఆమె చేసే షో ఏదైనా టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది.ఈ క్రమంలో సుమ చేసే సూపర్ హిట్ షోల్లో ఒకాటి క్యాష్.ఈ షోకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

 Anchor Suma Comedy Anchors Husband Lasya And Manjunath Cash Promo,cash Promo,  L-TeluguStop.com

సుమ ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన గెస్టులతో ఓ ఆట ఆడేసుకుంటుంది.ఇక లేటెస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా రాబోతున్న క్యాష్ ప్రోమో అలరించింది.

ఈ షోలో సుమ ప్రస్తుతం క్రేజీ యాంకర్స్ ని.వారి భర్తలని గెస్టులుగా పిలిచింది.ఈ క్రమంలో బుల్లితెర క్యూట్ యాంకర్ లాస్య హస్బండ్ మంజునాథ్ తో వచ్చింది సుమకి బాగా క్లోజ్ అవడం వల్ల లాస్య మీద మ్యాక్సిమం పంచులు వేసింది సుమ.ప్రోమోలో భాగంగా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నారు అని మంజునాథ్ ని అడిగితే లాస్య అతన్ని మాట్లాడనివ్వకుండా ఓవర్ ల్యాప్ చేస్తూ మాట్లాడుతుంది.అప్పుడు సుమ నీ.మీ ఆయన్ను మాట్లాడనివ్వమ్మా.అసలే యాంకర్ల మొగుళ్లకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని అంటుంటారని అన్నది.ఓ యాంకర్ గా తోటి యాంకర్ మీద సెటైర్ వేస్తూ అది తనకు వర్తిస్తుందని చెప్పకనే చెప్పేసుకుంది సుమ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube