ట్రోలర్లకు బుద్ధి చెప్పిన యాంకర్ సుమ.. ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు, కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే.కొన్నిసార్లు సెలబ్రిటీలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరైన అవగాహన లేకుండా సెలబ్రిటీలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

 Anchor Suma Clarifies Negative  Comments On Cow Video , Anchor Suma, Netizens, T-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం స్టార్ యాంకర్ సుమ ఆవు, దూడ ఉన్న ఒక వీడియోను షేర్ చేసి ఆ వీడియోలో దూడను రాముడు అని ప్రేమగా పిలుచుకున్నారు.

అయితే ఆ వీడియోలో దూడ మూతికి చిక్కం ఉండటంతో దూడ పాలు తాగకుండా చిక్కం కట్టారని కొందరు కామెంట్లు చేస్తే దూడ మూతికి చిక్కం కట్టి ఆవు పాలను సుమ అమ్ముకుంటున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.

అయితే సుమ ఫ్యాన్స్ మాత్రం దూడ మట్టి, తినకూడదని పదార్థాలను తినకుండా చేయడం కోసం మాత్రమే చిక్కం కట్టామని సుమ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.అయితే తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్లకు సమాధానంగా తాజాగా సుమ మరో వీడియోను షేర్ చేశారు.

డైరెక్ట్ గా నెటిజన్లకు సమాధానం చెప్పకుండా తన దగ్గర పని చేస్తున్న పాలేరును ప్రశ్నలు అడిగి నెటిజన్ల విమర్శలకు సుమ చెక్ పెట్టారు.సుమ పాలేరును దూడ మూతికి చిక్కం ఎందుకు కట్టావని ప్రశ్నించగా దూడ మట్టి తినకుండా ఉండటం కొరకు చిక్కం కట్టారని పాలేరు తెలిపారు.

ఆ తరువాత ఆవును పెంచుకోవడానికి గల కారణాలను సుమ వెల్లడించారు.ఆవు గోమూత్రం ద్వారా ఎరువు వస్తుందనే కారణంతో ఆవును పెంచుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.

ఆవుపాలతో వ్యాపారం చేయాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని ఆమె తెలిపారు.నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా సుమ పోస్ట్ పెట్టారు.

నెటిజన్ల ప్రశ్నలకు సమధానం దొరికిందని తాను ఆశిస్తున్నానని సుమ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube