ఏడాది మొత్తం ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు మాత్రం సుమ తప్పకుండా..! 20 ఏళ్ల క్రితం విలువ తెలియక.!   Anchor Suma About Voting Rights     2018-11-07   09:17:20  IST  Sainath G

సుమ కనకాల..తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి.యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది..స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.. అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు.ఒకవైపు టివి ప్రోగ్రాములు,మరోవైపు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సుమ.

ఏడాది మొత్తం బిజీ షెడ్యూల్ సుమ గారిది. ఏ చానెల్‌లో చూసినా ఆమె కనిపిస్తుంది. నవ్వుతూ, నవ్విస్తూ సెటైర్లు వేస్తూ ప్రోగ్రాంని రక్తికట్టిస్తుంది. మరి అంత బిజీగా ఉండే సుమ ఆ ఒక్కరోజు మాత్రం ఓ గంట విరామం తీసుకుని ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత గల పౌరురాలిగా ఓటు వేయడానికి వెళతానంటోంది. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది.

20 ఏళ్ల క్రితం ఓటు విలువ అంతగా తెలియక వేయలేకపోయామన్నారు. ఈసారి మాత్రం తప్పకుండా ఓటు వేస్తానంటోంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి జీవితం వారిది. అయితే ఓటు వేయడాన్ని కనీస కర్తవ్యంగా భావించి ఓటు హక్కుని వినియోగించుకోమంటోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.