ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తూ సెలబ్రిటీలకు చిరాకు, అసహనం తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ యాంకర్ శ్రీముఖికి కూడా తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చిరాకు తెప్పించే ప్రశ్న వేయగా ఆమె తనదైన శైలిలో స్పందించి నెటిజన్ కు బుద్ధి వచ్చేలా చేశారు.
బుల్లితెరపై వరుస షోలతో బిజీగా ఉంటూ వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న శ్రీముఖి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు.
సోషల్ మీడియాలో శ్రీముఖి షోలకు సంబంధించిన విశేషాలను పంచుకోవడంతో పాటు లైవ్ ఛాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తున్నారు.
ఒక నెటిజన్ న్యూడ్ ఫోటోను షేర్ చేయాలని శ్రీముఖిని కోరగా శ్రీముఖి ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన నగ్నం మూవీ పోస్టర్ ను విడుదల చేశారు.నగ్నం మూవీకి సంబంధించిన పోస్టర్ ను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
నెటిజన్ కు బుద్ధి వచ్చే విధంగా శ్రీముఖి చేసిన పోస్ట్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు సెలబ్రిటీలు ఎక్కువగా రియాక్ట్ కారు.కానీ శ్రీముఖి మాత్రం నెటిజన్ ప్రశ్నకు సమయస్పూర్తితో సమాధానం ఇచ్చారు.భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలు ఎవరూ వేయకుండా శ్రీముఖి బుద్ధి వచ్చేలా చేశారు.బుల్లితెర, వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రీముఖి లువీ పేరుతో వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు.
ఇప్పటికే ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ కాగా శ్రీముఖి కూడా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.
అనసూయ, రష్మీ స్థాయిలో శ్రీముఖికి ఆఫర్లు రాకపోయినా ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలు శ్రీముఖికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.