‘బెడ్ రూమ్’లో శ్రీముఖి రచ్చరచ్చ.. అమ్మాయిలకు మాత్రమేనట!  

anchor srimukhi makeup video goes viral in social media Patas, Srimukhi, Bomma Adirindhi, Zee Telugu, Pradeep, Chilasow Srimukhi, Makeup Man, Twitter - Telugu @mukhisree, Anchor Srimukhi Makeup Video Goes Viral In Social Media, Bomma Adirindhi, Chilasow Srimukhi, Makeup Man, Patas, Pradeep, Srimukhi, Twitter, Zee Telugu

పటాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రీముఖి ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై సత్తా చాటుతోంది.పరిమితంగానే షోలను ఎంపిక చేసుకుంటూ తన యాంకరింగ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

TeluguStop.com - Anchor Srimukhi Makeup Video Goes Viral In Social Media

ప్రస్తుతం శ్రీముఖి బొమ్మ అదిరింది షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు పలు ఈవెంట్లలో సందడి చేస్తోంది.వీటితో పాటు ఓ ఉమానియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఆదివారం రోజున జీ తెలుగు ఛానల్ లో శ్రీముఖి ప్రదీప్ ల పెళ్లి అంటూ ఒక ఈవెంట్ ప్రసారమైంది.గతంలో ఒక ఛానల్ లో రష్మీ సుధీర్ పెళ్లి అంటూ ఈవెంట్ జరిగి సక్సెస్ కావడంతో జీ తెలుగు నిర్వాహకులు సైతం ప్రదీప్ శ్రీముఖితో అదే తరహా ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

TeluguStop.com - బెడ్ రూమ్’లో శ్రీముఖి రచ్చరచ్చ.. అమ్మాయిలకు మాత్రమేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

శ్రీముఖి తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఈవెంట్ కు సంబంధించి ” చి ల సౌ శ్రీముఖిని అలంకరించు వేళ.అమ్మాయిలకు మాత్రమే” అని ఒక వీడియో గురించి ట్వీట్ చేసింది.

అందులో శ్రీముఖి ఒక వీడియో లింక్ ను షేర్ చేయగా 26 నిమిషాల వీడియోలో బెడ్ రూమ్ లో రచ్చ రచ్చ చేసింది.ఆ వీడియోలో శ్రీముఖి తన మేకప్ గురించి, మేకప్ మ్యాన్ గురించి, ఇయర్ రింగ్స్, క్యాస్టూమ్స్, ఇతర విషయాల గురించి చెప్పింది.

ఒకవైపు మేకప్ మ్యాన్ మేకప్ చేస్తుంటే ఆ మేకప్ అనుభవాల గురించి శ్రీముఖి చెప్పుకొచ్చింది.ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

యుట్యూబ్ లో ఈ వీడియోకు 4,75,000 వ్యూస్ రాగా 12,000 లైకులు వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు “శ్రీముఖి మేకప్ లేకపోయినా అందంగా ఉంటుందని.

మైకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు” అని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం శ్రీముఖి షోలు, ఈవెంట్లతో పాటు ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమాలో నటిస్తున్నారు.

#@MukhiSree #Twitter #Bomma Adirindhi #Makeup Man #Srimukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Srimukhi Makeup Video Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..