బుల్లి తెర యాంకర్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో సుమ తర్వాత శ్రీముఖి పేరు ఉంటుంది అనడం లో సందేహం లేదు.అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రీముఖి ఛానల్ తో సంబంధం లేకుండా ఒక కార్యక్రమం అని కాకుండా.
ప్రతి ఒక్క ఛానల్ తో కూడా అనేక కార్యక్రమాల కోసం ఒప్పందం పెట్టుకుని పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ వస్తోంది.ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానల్స్ లో కూడా శ్రీముఖి కనిపిస్తూ ఉంటుంది.

ఇక గత ఏడాది వాలెంటెన్స్ డే సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్లుగా అధికారికంగా పేర్కొంది.అంతే కాకుండా పెళ్లి చేసుకుంటానని కూడా అధికారికంగా వెల్లడించింది.కానీ ప్రేమ విషయాన్ని తెలియజేసి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.దాంతో శ్రీముఖి లవ్ బ్రేకప్ అయ్యిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు శ్రీముఖి ఎవరిని లవ్ చేసింది అనే విషయం పై కూడా క్లారిటీ లేకుండా పోయింది.శ్రీముఖి మరియు ప్రదీప్ ప్రేమలో ఉన్నారు అనే ప్రచారం జరిగింది.
కానీ అది ఎంత మాత్రం వాస్తవం కాదని ఇద్దరు కూడా పేర్కొన్నారు.శ్రీముఖి ఇండస్ట్రీ కి చెందని బయటి వ్యక్తిని ప్రేమించింది అనేది బుల్లి తెర వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ఆ విషయమై కూడా క్లారిటీ రాలేదు.శ్రీముఖి లవ్ మ్యాటర్ క్లారిటీ రాకుండానే బ్రేకప్ అయ్యిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా అయినా శ్రీముఖి తన యొక్క ప్రేమ వ్యవహారాన్ని ఫుల్ క్లారిటీగా చెప్తుందేమో చూడాలి.అన్ని వర్గాల ప్రేక్షకులకు శ్రీముఖి అంటే అభిమానం, ఆమె చేసే ప్రతి ఒక్క షో కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది.
అందుకే ఆమె లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.మరి కొన్ని రోజుల్లో ఆమె లవ్ స్టోరీ విషయమై క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.
