Srimukhi: శ్రీముఖి ఇంత సన్నబడ్డా హీరోయిన్ వేషాలు రావడం లేదా? వచ్చినా చేయడం లేదా?

తెలుగు బుల్లి తెర పై లేడీస్ సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి బుల్లి తెర రాములమ్మ అనే ట్యాగ్ కి సరిగ్గా సరిపోతుంది అంటూ శ్రీముఖికి పేరు దక్కింది.అలాంటి శ్రీముఖి ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలను చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

 Anchor Srimukhi Film Industry Entry Details, Anchor Srimukhi, Srimukhi, Srimukhi-TeluguStop.com

ఎందుకంటే గతంతో పోలిస్తే శ్రీముఖి ఇప్పుడు ఎంతో సన్నబడింది.చాలా నాజూకుగా కనిపిస్తూ టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్ కంటే ఈమె చాలా బెటర్ కదా అనే అభిప్రాయం కి అభిమానులు మరియు ప్రేక్షకులు వచ్చేలా చేసింది.

అంతటి అందం తో కనిపిస్తున్న శ్రీముఖి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ తెలుగు వెండి తెర ప్రేక్షకులను అలరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.కానీ ముద్దుగుమ్మ తీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కు కమిట్ అవ్వలేదు.

అసలు ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.కేవలం బుల్లి తెర పై మాత్రమే సందడి చేయాలి అనుకుంటే ఎందుకు సోషల్ మీడియా లో ఇంత రచ్చగా హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేయాలి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

హీరోయిన్ గా చేయాలి అనుకుంటే మాత్రమే ఇలాంటి ఫోటో షూట్స్ షేర్ చేయాలి తప్పితే బుల్లి తెర కు ఈ రేంజ్ అందాల ఆరబోత అవసరం లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈమె సందడి చేస్తే చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.

Telugu Anchor Srimukhi, Srimukhi, Srimukhi Debut, Srimukhiglamor, Srimukhi Offer

హీరోయిన్ గా శ్రీముఖి చేయాలని సిద్ధంగా ఉన్న ఆఫర్స్ రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ శ్రీముఖి ఓకే చెబితే తాము సిద్దంగా ఉన్నాం అంటూ చిన్న హీరోలు… చిన్న దర్శక నిర్మాతలు క్యూ కడతారు అందులో ఎలాంటి అనుమానం లేదు.శ్రీముఖి ఎందుకు చిన్న సినిమా లు చేయడం లేదు ఒకేసారి పెద్ద సినిమాల్లో నటించాలని ఆమె కోరుకుంటున్నా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి శ్రీముఖి నుండి ఒక మంచి కమర్షియల్ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఆ కమర్షియల్ పాత్ర శ్రీముఖి కి ఎప్పుడు దక్కుతుందో కాలమే నిర్ణయించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube