పటాస్ షో నుంచి తప్పుకున్న శ్రీ ముఖి! ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు  

పటాస్ షో నుంచి తప్పుకున్న శ్రీ ముఖి .

Anchor Sri Mukhi Left Out From Patas Show-anchor Sri Mukhi Left Out,jabardasth,patas Show,telugu Cinema,tollywood

తెలుగు టెలివిజన్ రంగంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తున్న జబర్దస్త్ షో తర్వాత అంతగా పాపులర్ అయిన షో పటాస్. తెలుగు స్టాండ్ అప్ కామెడీ షోగా యూత్ కి విపరీతంగా దగ్గరైన ఈ షోలో యాంకర్ రవికి జోడీగా లేడీ యాంకర్ శ్రీముఖి చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ పటాస్ షో రవి, శ్రీ ముఖి యాంకరింగ్ వలెనే క్లిక్ అయ్యిందో అంటే అతిశయోక్తి కాదు..

పటాస్ షో నుంచి తప్పుకున్న శ్రీ ముఖి! ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు-Anchor Sri Mukhi Left Out From Patas Show

అయితే అలాంటి షో నుంచి ఉన్నపళంగా శ్రీ ముఖి తప్పుకోవడం ఇప్పుడు ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. ఇక పటాస్ షో నుంచి కొన్ని వ్యక్తిగత కారణాల ద్వారా తప్పుకుంటున్నట్లు ఆమె అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ విషయంలో తనకి ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా సపోర్ట్ దొరికిందని చెప్పుకొచ్చారు.

పటాస్ షో ఫ్యాన్స్ అందరికి ఈ విషయం చెప్పుకోవాల్సిన అవసరం తనపై ఉంది కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు శ్రీ ముఖి చెప్పడం గమనార్హం. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె షో నుంచి తప్పుకుందా, లేదంటే రవితో ఆమెపై వస్తున్నా రూమర్స్ భరించలేక ఈ షోకి దూరమవుతుందా అనే డౌట్ ఇప్పుడు ఆడియన్స్ లో వస్తుంది. ఒక వేళ శ్రీ ముఖి షో నుంచి తప్పుకుంటే అంతలా రవికి జోడీగా పటాస్ షోలో మెప్పించే యాంకర్ ఎవరు అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తుంది.