'వకీల్‌సాబ్‌' తో శ్రీముఖి కి పనేంటో?

పవన్‌ కళ్యాణ్‌ కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా పరిశ్రమలో చాలా మంది కూడా పవన్‌కు అభిమానులే.

 Anchor Sreemukhi At Pawan Kalyan Vakeel Saab Shooting, Pawan Kalyan, Vakeel Saab-TeluguStop.com

పవన్‌ తో ఒక్క సినిమా చేయాలని కొందరు, పవన్‌ తో కనీసం ఒక్క సెల్ఫీ తీసుకోవాలని మరికొందరు ఆశ పడుతూ ఆరాట పడుతూ ఉంటారు.అలా చాలా కాలంగా ఆరాటపడుతున్న శ్రీముఖి కోరిక తీరింది.

ఈ అమ్మడు పవన్‌ కళ్యాన్‌ తో సెల్ఫీ తీసుకుని తన కోరిక తీర్చుకుంది.పవన్‌ ప్రస్తుం వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఆ సినిమా షూటింగ్‌ సందర్బంగా పవన్‌ మరియు శ్రీముఖి కలిశారు.పవన్‌ మళ్లీ దొరుకుతాడో లేదో అనుకుని ఫొటో అడిగేసింది.

అడిగితే కాదు అనని పవన్‌ కళ్యాణ్‌ ఫొటోను సెల్ఫీని కూడా ఇచ్చేశాడు.ప్రస్తుతం పవన్‌ తో శ్రీముఖి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇదే సమయంలో వకీల్‌ సాబ్‌ సెట్‌ లో శ్రీముఖికి పని ఏంటీ అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ వకీల్‌ సాబ్‌ మూవీ ఆడవారి సమస్యలకు సంబంధించిన సినిమా అనే విషయం తెల్సిందే.

ఈ సినిమాలో అంజలి మరియు నివేదా థామస్‌ లు నటిస్తున్నారు.వారికి సంబంధించిన ఎలాంటి పోస్టర్‌ కాని పొటోలు కాని విడుదల కాలేదు.

ఇప్పుడు ఈ సినిమాలో వారితో పాటు శ్రీముఖి కూడా నటిస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కోర్టు సీన్‌ లో శ్రీముఖి ఏమైనా కనిపిస్తుందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా టాక్‌ వినిపిస్తుంది.

మరో వైపు శ్రీముఖి ఒక ఓటీటీ మూవీలో నటిస్తుంది.ఆ సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొంటుంది.

ఆ సినిమా షూటింగ్‌ సందర్బంగా పక్కనే జరుగుతున్న వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ లో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ను ఆమె కలిసి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి పవన్‌ కళ్యాన్‌ తో ఫొటో తీసుకోవడంతో అమ్మడి ఆనందంకు అవధులు లేవు.

లవ్‌ యు అంటూ పవన్‌ పై తన అభిమానంను చూపించి ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube