అలాంటి వాటికి నో చెప్పడం వల్లే స్టార్‌ను కాలేక పోయానన్న శ్రీముఖి  

Anchor Sreemukhi Not Interested Movies - Telugu Movies, Not Interested, Skin Exposing, Sreemukhi, Tv Shows

బుల్లి తెరపై శ్రీముఖికి స్టార్‌గా గుర్తింపు దక్కింది.రియాల్టీ షోు, కామెడీ షోలు, హోస్టింగ్‌ కార్యక్రమాలు ఇంకా పలు సినీ కార్యక్రమాలకు శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉంది.

 Anchor Sreemukhi Not Interested Movies

ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసింది.ఈ అమ్మడు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

తాజాగా ఈ అమ్మడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.

అలాంటి వాటికి నో చెప్పడం వల్లే స్టార్‌ను కాలేక పోయానన్న శ్రీముఖి-Latest News-Telugu Tollywood Photo Image

మొదట సినిమాల్లో నటించాలనే కోరిక నాలో బాగా ఉండేది.

జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లి పాత్రలో చేసిన సమయంలో హీరోయిన్‌గా కూడా ఆఫర్లు వచ్చాయి.అయితే ముద్దు సీన్స్‌, ఎక్స్‌ పోజింగ్‌ సీన్స్‌ చేయాలంటూ వారు అడిగారు.

దాంతో నేను సినిమాలకు దూరం అయ్యాను.నేను సినిమల్లో నటించడం మా నాన్నకు ఇష్టం లేకపోవడం వల్ల కూడా నేను సినిమాల్లో నటించలేదు అంది.

సినిమాల్లో నటిస్తే ఖచ్చితంగా వాటికి ఒప్పుకోవాల్సి వస్తుంది.అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను.

బుల్లి తెరపై చేస్తూ సినిమాల్లో రాణించలేరని కొందరు అన్నారు.దాంతో సినిమాలపై పూర్తిగా ఆశలు వదులుకుని బుల్లి తెరకు పరిమితం అయినట్లుగా చెప్పుకొచ్చింది.ఈ అమ్మడు బుల్లి తెరపై చేసే హడావుడితో స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంది.అయితే ఈమె వెండి తెరపై తన అందాలను చూపిస్తూ హీరోయిన్‌గా నటిస్తే ముంబయి ముద్దుగుమ్మల కంటే ఎక్కువగా ఈమెకు ఛాన్స్‌ వచ్చేవంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

కాని ఆమె మాత్రం అలాంటి వాటికి నో చెప్పడం వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Sreemukhi Not Interested Movies Related Telugu News,Photos/Pics,Images..