లైవ్ లో అతడికి ముద్దులు పెట్టిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న వీడియో!

కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటిస్తూ ఆ తర్వాత బుల్లితెరపై “అదుర్స్”, “పటాస్” వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై పలు ఈవెంట్లు కార్యక్రమాలను నిర్వహిస్తూ బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి కి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

 Anchor Sree Mukhi Kisses Sekhar Master Again In Comedy Stars Show, Anchor Sreemu-TeluguStop.com

కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయిన శ్రీముఖి వ్యక్తిగతంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇప్పటివరకు పలు కార్యక్రమాల ద్వారా భారీ ట్రోలింగ్ కు గురైన శ్రీముఖి తాజాగా ఒక లైవ్ షోలో రెచ్చిపోతూ కొరియోగ్రాఫర్ కి ముద్దులు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

గత కొద్ది రోజుల క్రితం శ్రీముఖి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి ఓ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు.ఈ క్రమంలోనే శ్రీముఖి రెచ్చిపోతూ శేఖర్ మాస్టర్ తో కలిసి చిందులు వేశారు.

ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా శ్రీముఖి శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టడంతో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ కి కూడా బాగా హైప్ క్రియేట్ అయింది.

ఇది మరవకముందే శ్రీముఖి తాజాగా మరోసారి శేఖర్ మాస్టర్ పై ముద్దుల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే ఆదివారం ప్రసారం కాబోతున్న “కామెడీ స్టార్స్” కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ షోలో రాములమ్మ సందడి చేశారు.ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తో కలిసి మరోసారి డాన్స్ చేసిన శ్రీముఖి లైవ్ లోనే శేఖర్ మాస్టర్ పై ముద్దుల వర్షం కురిపించింది.

దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే శ్రీముఖి వేషంలో ఉన్న అవినాష్ మాట్లాడుతూ… మొన్న నేను పెట్టిన ముద్దు వైరల్ అయ్యింది తెలుసా అంటూ… కామెంట్ చేయగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.ఆ ముద్దు సీన్ తర్వాత మా ఇంట్లో వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా… అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు శ్రీముఖిని దారుణంగా ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube