బాయ్ ఫ్రెండ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ యాంకర్...  

Anchor Sreemukhi Gives Clarity About Her Boyfriend - Telugu Sreemukhi Boy Friend, Sreemukhi Boy Friend Latest News, Sreemukhi Boy Friend News, Sreemukhi Latest News, Sreemukhi News, Tollywood Anchor Sreemukhi

తెలుగులో జులాయి సినిమాలో క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది యాంకర్ శ్రీముఖి.ఆ తర్వాత నేను శైలజ చిత్రంలో రామ్ కి అక్క పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

Anchor Sreemukhi Gives Clarity About Her Boyfriend

ప్రస్తుతం పలు రకాల షోలు ఈవెంట్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ అమ్మడు.అయితే ఇటీవల కాలంలో  శ్రీముఖి ఇచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

దీంతో కొన్ని వెబ్సైట్లు ఈ విషయాలను వక్రీకరిస్తూ ఉన్నది లేనిది కల్పించి రాస్తూ పబ్లిష్ చేస్తున్నారు.ఈ విషయంపై తాజాగా శ్రీముఖి స్పందించింది.ఇందులో భాగంగా నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని వెబ్ సైట్ లలో తన గురించి తప్పుడు కథనాలు వస్తున్నాయని తనకు ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేడని స్పష్టత ఇచ్చింది.అంతేకాక తాను చెప్పింది ఒకటైతే మీడియా రాసింది మరొకటని ఇలాంటివి మరోసారి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అంతేగాక ఒకవేళ తనకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉంటే నా బాయ్ ఫ్రెండ్ అంటూ తన అభిమానుల ముందు వీడియో చేసి అప్లోడ్ చేస్తానని అన్నారు.ఇలాంటి వార్తలు రాసే వారికి అవసరమైనప్పటికీ నిజానిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని అన్నారు.దీంతో గత కొద్దికాలంగా శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ గురించి వైరల్ అవుతున్న వార్తలకు ఒక్కసారిగా పుల్ స్టాఫ్ పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Sreemukhi Gives Clarity About Her Boyfriend Related Telugu News,Photos/Pics,Images..

footer-test