వైరల్ వీడియో.. శ్రీముఖి చేసిన పనికి కళ్ళుతిరిగి పడిపోయిన నాగబాబు!

Anchor Sreemukhi And Naga Babu Funny Video Goes Viral

బుల్లితెర స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు.ఈమె తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

 Anchor Sreemukhi And Naga Babu Funny Video Goes Viral-TeluguStop.com

అంతలా ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకులను తన వాక్ చాతుర్యంతో కట్టి పడేస్తుంది.పర్ఫెక్ట్ టైమింగ్ మైంటైన్ చేస్తూ ఎదుటి వాళ్ళకి పంచులు మీద పంచులు వేస్తూ కామెడీ తెప్పిస్తుంది.

ఇక ఈమె పటాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వడమే కాకుండా స్టార్ యాంకర్ గా ఎదిగిపోయింది.ఈ షో ద్వారా బుల్లితెర రాములమ్మ గా కూడా పేరు తెచ్చుకుంది.

 Anchor Sreemukhi And Naga Babu Funny Video Goes Viral-వైరల్ వీడియో.. శ్రీముఖి చేసిన పనికి కళ్ళుతిరిగి పడిపోయిన నాగబాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె ప్రెసెంట్ షోలు తక్కువుగా చేస్తున్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.అందం తో పాటు కావలసినంత అల్లరి కూడా శ్రీముఖిలో ఉంది.

అందుకే ఈమె యాంకరింగ్ అంటే చాలా మంది ఇష్ట పడుతుంటారు.ఇక ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది.

ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

ఈమె ఎప్పుడు షూటింగ్ గ్యాప్ లోనో లేదంటే షూటింగ్ లేనప్పుడో సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేస్తూ అభిమానులను ఎటెర్టైన్ చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా ఈ అమ్మడు నాగబాబుతో కలిసి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

ఇక తాజాగా ఈ వీడియోలో ఈ అమ్మడు తన సింగింగ్ టాలెంట్ మొత్తం నాగబాబు మీద చూపించి ఆయనకు పట్టపగలే చుక్కలు చూపించింది.

అయితే ఇదంతా నిజం మాత్రం కాదు.కేవలం ఫన్ కోసం మాత్రమే ఇలా వీడియో చేశారు.ఈ వీడియోలో నాగబాబు ప్రేమగా శ్రీముఖి నా కోసం ఒకటి చేస్తావా.

అని అడిగితే మీరు అడిగితే చేయకుండా ఎలా ఉంటా అని శ్రీముఖి చెబుతుంది.అప్పుడు నాగబాబు నా కోసం నీ నోటి నుండి ఒక పాట పాడవా అని అడిగారు.

దాంతో శ్రీముఖి సిగ్గుపడుతూ రాగం అందుకోవడంతో నాగబాబు కళ్ళు తిరిగి పడిపోయాడు.

ఇక ఈ వీడియోను శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.దీంతో ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఆమె గొంతు గురించి తెలిసి కూడా మీరు ఎలా పాడమని అడిగారు అని నాగబాబును ప్రశ్నిస్తున్నారు.

#AnchorSreemukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube