యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం.. ఆవిడ చనిపోవడంతో?

బుల్లితెర యాంకర్ శ్రీముఖి వరుసగా ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.వెండితెరపై కూడా శ్రీముఖికి సినిమా ఆఫర్లు వస్తుండగా సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Anchor Sreemukhi Ammamma Passed Away And She Shared A Post On Instagram-TeluguStop.com

అయితే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు.అనారోగ్య సమస్యల వల్ల అమ్మమ్మ చనిపోగా శ్రీముఖి మిస్ యూ అని పెట్టడం గమనార్హం.

శ్రీముఖి తన సోషల్ మీడియా ఫాలోవర్లతో అమ్మమ్మకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేవారని అమ్మమ్మ అంటే తనకు చాలా ఇష్టమని శ్రీముఖి అన్నారు.

 Anchor Sreemukhi Ammamma Passed Away And She Shared A Post On Instagram-యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం.. ఆవిడ చనిపోవడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమ్మమ్మ ఎప్పుడూ ధైర్యంగా ఉండేవారని ఇతరులకు సంతోషాన్ని పంచేవారని శ్రీముఖి పేర్కొన్నారు.అమ్మమ్మను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని జీవితంలో అమ్మమ్మ ఇచ్చిన ప్రతిదానికి స్పెషల్ థ్యాంక్స్ అని శ్రీముఖి అన్నారు.

శ్రీముఖి అమ్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వెండితెర, బుల్లితెర ప్రముఖులు సైతం శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతున్నారు.శ్రీముఖి పటాస్ షో ద్వారా ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ షో శ్రీముఖికి పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచింది.

బుల్లితెరపై శ్రీముఖి టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గత నెలలో శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.శ్రీముఖి మళ్లీ సినిమా, టీవీ ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా శ్రీముఖికి భారీ మొత్తంలో పారితోషికం దక్కిందని తెలుస్తోంది.

శ్రీముఖికి సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని సమాచారం అందుతోంది.

#Sreemuukhi #Srimukhi #Crazy Uncles #Shared #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు