నేను ఆ తప్పులు చేయలేదు.. శ్యామల కీలక వ్యాఖ్యలు..?

సీరియల్ నటిగా, యాంకర్ గా, సినిమా నటిగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో యాంకర్ శ్యామల మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.వివాదాలకు దూరంగా ఉండే ఈ యాంకర్ సుమలా ట్రెడిషనల్ గానే ఎక్కువగా కనిపిస్తూ అవకాశాలను సొంతం చేసుకున్నారు.

 Anchor Shyamala Says I Feel Competetion With Only Suma Kanakala,latest Tollywood-TeluguStop.com

సుమ తర్వాత సినిమా ఈవెంట్లను హోస్ట్ చేసే అవకాశాలు సైతం శ్యామలకే ఎక్కువగా వస్తుండటం గమనార్హం.తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లడిన శ్యామల ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కాకినాడకు చెందిన శ్యామల తెలుగు చక్కగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.తెలుగు బాగా మాట్లాడటంతో చాలామంది నెటిజన్లు సుమ తర్వాత మీరేనని చెబుతుంటారని అలా నెటిజన్లు చెప్పిన సమయంలో తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

తాను మోడ్రన్ డ్రెస్సులను కూడా ధరిస్తానని అయితే ఆ డ్రెస్సులు పద్ధతిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

మహిళలు తనకు ఎక్కువగా కనెక్ట్ అవుతారని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అబ్బాయిలు సైతం తనను అక్కా అని పిలుస్తూ ఈవెంట్లకు వెళ్లిన సమయంలో బాగా రిసీవ్ చేసుకుంటారని శ్యామల చెప్పారు.

భర్త ప్రోత్సాహంతో తాను యాంకరింగ్ పై దృష్టి పెట్టానని శ్యామల తెలిపారు.భర్త స్నేహితుని వల్ల తనకు స్టార్ మా చానెల్ లో ప్రసారమైన మా ఊరి వంట కార్యక్రమంలో ఛాన్స్ దక్కిందని ఆమె అన్నారు.

ఇప్పటివరకు తన ప్రయాణం బాగానే ఉందని కొందరు వేగంగా ఫలితాలు రావాలని పరుగులు పెడతారని తాను మాత్రం ఆ తప్పు చేయనని శ్యామల చెప్పుకొచ్చారు.తాను అలా చేయను కాబట్టే తనపై ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ రాలేదని శ్యామల వెల్లడించారు.

బ్యాడ్ కామెంట్ల వల్ల బాధపడిన సందర్భాలు తన జీవితంలో రాలేదని తాను ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదని శ్యామల తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube