మళ్లీ పెరిగిన శివ గ్రాఫ్.. కంటిన్యూ అయితే టాప్‌ 5 ఖాయం

తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మెల్ల మెల్లగా జోరందుకుంది.ఈ షో ప్రారంభమైన సమయం లో పెద్దగా ప్రేక్షకులు పట్టించు కోలేదు.

 Anchor Shiva Super Hype In Telugu Biggboss Nonstop Telugu Details, Anchor Shiva,-TeluguStop.com

కానీ కంటెస్టెంట్స్ మరియు వారి ప్రవర్తన ఒక్కొక్కరి విధానం నచ్చిన ప్రేక్షకులు కొందరు తెగ ఫాలో అవుతున్నారు.ఎప్పటి లాగే సోషల్ మీడియాలో తమ అభిమాన కంటెస్టెంట్ కు సంబంధించిన పేజీలు ఫాలో అవుతూ.

అందులో హాట్ హాట్ గా కామెంట్స్ చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు.యూట్యూబ్ నుండి వెళ్ళిన యాంకర్‌ శివ మొదట అందరి దృష్టిని ఆకర్షించాడు.

చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకోవడంతో అందరి దృష్టి అతనిపై పడింది.అదే సమయంలో అతడు ఎంటర్టైన్మెంట్ చేసే విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది అందుకే అతడిని అభిమానించడం మొదలు పెట్టారు.

అయితే సరయు తో డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడటంతో పాటు అషు రెడ్డి తో అసభ్యకరంగా మాట్లాడుతాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.నాగార్జున కూడా శివకు వార్నింగ్ ఇచ్చాడు.

ఆ సమయంలో యాంకర్ శివ గ్రాఫ్ తగ్గినట్లు అనిపించింది.కానీ యాంకర్ శివ మళ్లీ రెచ్చిపోయాడు.

తాజాగా అతడిని హౌస్ మొత్తం కలిసి మోస్ట్ ఇరిటేట్ పర్సన్ గా ట్యాగ్‌ ఇచ్చింది.దాంతో అతడు మరింత ఎంటర్ టైన్‌ చేశాడు.

Telugu Anchor Shiva, Ariyana, Ashu Reddy, Bb Nonstop, Bigg Boss, Biggboss, Madha

ఇంటి సభ్యులు అందరికి అనుమతితోనే శివ ఏం పని అయినా చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్బాస్ వార్నింగ్ ఇవ్వడంతో అర్ధరాత్రి సమయంలో వస్తుంది బాత్రూంకి వెళ్ళాలి అని అషు రెడ్డి మరియు అరియానాను అడగడం నవ్వు తెప్పించింది.అంతే కాకుండా బిందుమాధవి తో వ్యవహరించే తీరు కూడా ప్రేక్షకులను మరింత దగ్గర చేసింది అనడం లో సందేహం లేదు.మాధవి అభిమానులు కూడా యాంకర్ శివ కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.యాంకర్ శివ ఫైనల్‌ వరకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అతడి ప్రవర్తనతో గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube