నన్ను పెళ్లి చేసుకుంటారా.. రాశి ఖన్నాకు యాంకర్ శివ ప్రపోజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివ గురించి మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకముందే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులారిటిని సంపాదించుకున్నాడు.

 Anchor Shiva Marriage Proposal To Rashi Khanna In Pakka Commercial Interview , Rashi Khanna, Anchor Shiva, Bigg Boss, Marriage, Prapose-TeluguStop.com

శివ కి పులిహోర రాజా అనే పేరు ఉంది అన్న విషయం తెలిసిందే.సందుదొరికింది అంటే చాలు పులిహోర కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

అలా బిగ్ బాస్ హౌస్ లో కూడా అషురెడ్డి, అరియానా, తేజస్వి, సరయు, హమీదా ఇలా చాలామందితో యాంకర్ శివ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఏకంగా హీరోయిన్ రాశి కన్నా తోనే పులిహోర కలపడానికి ప్రయత్నించాడు యాంకర్ శివ.

రాశిఖన్నా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమా మంచి హిట్ అయిన సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.

ఈ క్రమంలోనే యాంకర్ శివ కూడా ఒక రాశిఖన్నాను ఇంటర్వ్యూ చేశాడు.ఈ ఇంటర్వ్యూలో రాఖీ ఖన్నాను పెళ్లి చేసుకోమని చెబుతూ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు.

తనకి కాబోయే వాడు మంచి భక్తుడు అయ్యి ఉండాలని అపుడెపుడో రాశీ ఖన్నా అనడంతో నేను మంచి భక్తుడ్నే ట్రై చేసుకోవచ్చా అని అన్నాడు.దీంతో రాశీ ఖన్నా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.

Telugu Anchor Shiva, Bigg Boss, Prapose, Rashi Khanna-Latest News - Telugu

హో అవునా సర్లే ఇంటర్వ్యూ తరువాత మాట్లాడదాం అని అనేసింది.ఆ తరువాత భక్తి కంటే ముందు ఆ వ్యక్తితో కనెక్షన్ ఉండాలి.ఎవరితో ఎప్పుడు కనెక్ట్ అవుతామో తెలియదు.ఎవరితో అయినా అవ్వొచ్చు అంతా దైవాదీనం.మంచి హార్ట్ ఉండాలి అని చెప్పుకొచ్చింది రాశిఖన్నా.వెంటనే శివ నాకు చాలా హార్ట్ ఉంది.

పైగా నేను మీ భక్తుడ్నే.పెళ్లి చేసుకుంటారా? అని అడిగగా ఆ మాటకి పెద్దగా నవ్వినా రాశీ.నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు అని సిగ్గుపడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube