శ్రీహరి నన్ను చంపేస్తా అన్నాడు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

సినిమాల్లో హీరో పాత్రలతో పాటు విలన్ పాత్రలు చేసి నటుడిగా శ్రీహరి పాపులారిటీని సంపాదించుకున్నారు.సాయం కోరి వచ్చిన వాళ్లకు తన వంతు సహాయం చేసి శ్రీహరి మంచి పేరును సొంతం చేసుకున్నారు.

 Anchor Sattenna Interesting Comments About Actor Srihari, Srihari, In An Intervi-TeluguStop.com

శారీరక దారుఢ్య పోటీలలో ఏడుసార్లు పాల్గొని శ్రీహరి మిస్టర్ హైదరాబాద్ టైటిల్ ను గెలుచుకున్నారు.మన దేశం తరపున ఏషియన్ గేమ్స్ లో ఆడాల్ని శ్రీహరి భావించినా ఆ కోరికను తీర్చుకోలేకపోయారు.

1986 సంవత్సరంలో శ్రీహరి స్టంట్ మాస్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి తర్వాత కాలంలో నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి పేరును సొంతం చేసుకున్నారు.రియల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న శ్రీహరి 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించడం గమనార్హం.

శ్రీహరి పోలీస్ పాత్రల్లో ఎక్కువగా నటించగా ఆ పాత్రలు శ్రీహరికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీహరి సినిమాల్లో కొనసాగారు.

తన సినిమాలతో శ్రీహరి తెలంగాణ యాసకు గౌరవాన్ని తీసుకొచ్చారు.

ప్రముఖ నటుడు, యాంకర్ సతీష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో చేదు అనుభవాలు చాలానే ఉన్నాయని తెలిపారు.శ్రీహరి గారితో తనకు పెద్ద గొడవ జరిగిందని శ్రీహరి నటించిన పరశురామ్ సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా గురించి ఛానల్ లోని ప్రోగ్రామ్ లో భారీగా సెటైర్లు వేశానని సతీష్ వెల్లడించారు.

టీవీలో తన పేరు సత్తెన్న కాబట్టి తనను శ్రీహరి గుర్తు పట్టేవారు కాదని శ్రీహరి తనతో సత్తెన్నను చంపేస్తా అని తన గురించి తనకే చెప్పేవారని సతీష్ తెలిపారు.ఒకరోజు సత్తెన్న గెటప్ లో శ్రీహరి ఇంటికి వెళ్లానని శ్రీహరి తనను చూసి షాకయ్యారని ఆ తర్వాత భార్యను పిలిచారని సతీష్ చెప్పారు.వీడెక్కడైనా కనిపిస్తే చంపేస్తా అని శ్రీహరి అన్నారని శాంతి చెప్పారని సతీష్ తెలిపారు.

ఆ తర్వాత శ్రీహరి తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడని సతీష్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube