చెల్లికి సెట్ చేద్దాం అనుకుని నేనే పెళ్లి చేసుకున్నా అంటూ లవ్ స్టోరీ సీక్రెట్స్ చెప్పిన యాంకర్ సమీర!

బుల్లితెర నటి సమీరా అనగానే వెంటనే గుర్తుపట్టకపోయినా.ఆ మధ్య జీ తెలుగు లో ప్రసారమైన అదిరింది షో మొదటి యాంకర్ సమీరా అనగానే వెంటనే గుర్తు పట్టవచ్చు.

 Anchor Sameera Sherief Revealed Her Love Story With Syed Anwar-TeluguStop.com

తను బుల్లితెర చాలా సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా.ఇటీవలే ముగిసిపోయిన అదిరింది షోలో మొదట్లో యాంకరింగ్ చేసింది.

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడినుంచి మళ్ళీ తన సీరియల్ జీవితం లోకి వెళ్ళింది.ఇదిలా ఉంటే తను తన ప్రేమ గురించి కొన్ని సీక్రెట్ లను అభిమానులతో పంచుకుంది.

 Anchor Sameera Sherief Revealed Her Love Story With Syed Anwar-చెల్లికి సెట్ చేద్దాం అనుకుని నేనే పెళ్లి చేసుకున్నా అంటూ లవ్ స్టోరీ సీక్రెట్స్ చెప్పిన యాంకర్ సమీర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమెకు ఓ అక్క, ఓ చెల్లెలు ఉండగా.తన అక్క నాన్ ముస్లిం అయినా తమిళయన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందని, ఇక తన చెల్లి బాధ్యత తనపై పడిపోవడంతో ఓ మంచి ముస్లిం కుటుంబానికి చెందిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట.

కానీ తన చెల్లెలికి ఇచ్చి పెళ్ళి చేసుకోవాలనుకున్నా అబ్బాయినే తాను పెళ్లి చేసుకుందట‌.దీంతో తన చెల్లి కి ఇవ్వాలనుకున్న అబ్బాయితో తన ప్రేమ ప్రయాణం ఎలా జరిగిందో చెప్పుకొచ్చింది సమీరా.

ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో కాదు.సినీ సీనియర్ నటి సన కొడుకు అన్వర్.

ఆమె ఓ షాపింగ్ మాల్ కు పెళ్లి తన పని తాను చూసుకుంటున్న సమయంలో.అన్వర్, తన ఫ్రెండ్ వచ్చి తనను సమీరా అని పిలిచాడట అన్వర్.దీంతో తనతో మాట మాట కలుపుకొని తనతో ఫోటో దిగొచ్చా అని అనగానే మరో అబ్బాయి వాళ్ళ ఫోటో దింపడాట‌.దీంతో ఆయన ఆమెను తన యాక్టింగ్ బాగుందని చెప్పగా ఆమె ఓకే ఓకే అనేసిందట.

ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళుతూ తను సన కొడుకని చెప్పడంతో.ఆమె తనకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా.తన కొడుకు తో దిగిన ఫోటో ఆమెకు పంపిందట‌.

అంతేకాకుండా సన, సమీరా కలిసి ఆ సమయంలో ప్రతిబింబం సీరియల్ లో నటిస్తున్నామని తెలిపింది.

ఆ తర్వాత తనతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుంటూ సన్నిహితంగా మారారట.అంతే కాకుండా మాటల మధ్యలో ప్రపోజ్ కూడా చేసిందట.వయసులో తన కంటే నాలుగు నెలలు చిన్నోడని తెలిసాక కూడా.అతనిని తన చెల్లి కి సెట్ చేయాలని మాట్లాడిందట‌.

కానీ చివరికి తనే ఆయన మాయలో పడిపోయానని తెలిపింది.

ఇక తన కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుపుతూ ఆయనను కొన్ని ప్రశ్నలతో షేర్ చేసుకోగా అతని నుంచి మంచి స్పందన రావడంతో వెంటనే తన చెల్లిని పక్కన పెట్టేసి తను కనెక్ట్ చేసుకున్నానని తెలిపింది.

#Syed Anwar #Sameera Sherief #Love Story #Revealed #Anchor Sameera

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు