యాంకర్ రవి పరువు తీసిన భార్య.. ఏం జరిగిందంటే..?

దశాబ్దానికి పైగా బుల్లితెరపై మేల్ యాంకర్ గా కొనసాగుతూ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు యాంకర్ రవి.ఈ ఛానెల్ ఆ ఛానెల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెల్స్ లోని ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ రవి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

 Anchor Ravi Wife Shocking Comments In Big Celebrity Challenge Show-TeluguStop.com

స్టార్ మా మ్యూజిక్ ద్వారా యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన యాంకర్ రవి ప్రస్తుతం స్టార్ మా, జీ తెలుగు ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు.
యాంకర్ రవి స్టార్ యాంకర్ సుమతో కలిసి జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే.

రవి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రవి అతని బాల్య స్నేహితురాలైన నిత్యా సక్సేనాను వివాహం చేస్తున్నారు.షోలు, ఈవెంట్లకు తక్కువగా హాజరయ్యే నిత్యా సక్సేనా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోకు హాజరై యాంకర్ రవికి సంబంధించిన సీక్రెట్లను ఆ షోలో నిత్యా సక్సేనా వెల్లడించారు.

 Anchor Ravi Wife Shocking Comments In Big Celebrity Challenge Show-యాంకర్ రవి పరువు తీసిన భార్య.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెల్లవారు జామున 3 గంటల సమయంలో వస్తాడని అడిగితే షూటింగ్ లో ఉన్నానని చెబుతాడని ఆమె అన్నారు.ఆ తర్వాత సుమ నిత్యా సక్సేనాను మొబైల్ లో మీ పేరు రవి ఏమని సేవ్ చేసుకున్నారు అని అడగగా తనకు నిజంగా ఆ ప్రశ్నకు సమాధానం తెలియదని రవి సెల్ ఫోన్ పాస్ వర్డ్ కూడా తెలియదని ఆమె సమాధానమిచ్చారు.

రవి మొబైల్ ను చూసే సాహసం కూడా చేయనంటూ నిత్య రవి పరువు తీసేశారు.

మరోవైపు పటాస్ షోకు కొన్ని కారణాల వల్ల దూరమైన రవికి ఈటీవీ ఛానెల్ లో అవకాశాలు తగ్గాయి.

రవి కామెడీ స్టార్స్ షోలో లాస్యతో కలిసి స్కిట్లు చేస్తుండగా ఆ స్కిట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

#Anchor Ravi #Ravi Marriage #Nitya Saxena #BigCelebrity

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు