ప్రదీప్ ఆమెను లవ్ చేస్తున్నాడంటున్న యాంకర్ రవి!

తెలుగు బుల్లితెర యాంకర్లలో ఫిమేల్ యాంకర్ గా సుమకు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో మేల్ యాంకర్ గా ప్రదీప్ కు కూడా అదే స్థాయిలో గుర్తింపు ఉంది.తనదైన శైలిలో అదిరిపోయే పంచ్ లు వేస్తూ షోను హిట్ చేయడం ప్రదీప్ ప్రత్యేకత.

 Anchor Ravi Shocking Comments On Pradeep Machiraju Love Track, Anchor Pradeep, A-TeluguStop.com

ప్రతిభ పుష్కలంగా ఉన్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.కొన్ని రోజుల క్రితం ప్రదీప్ త్వరలో రాయలసీమ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి.

అయితే అధికారికంగా ప్రదీప్ నుంచి మాత్రం పెళ్లి ప్రకటన వెలువడలేదు.తాజాగా మరో యాంకర్ రవి ప్రదీప్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ ప్రోగ్రామ్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.గత ఎపిసోడ్లలో సింగర్ హారిక గురించి ప్రదీప్ ‘బిజీగా ఉండి మిమ్మల్ని చూడలేదు’ అని కామెంట్ చేశాడు.

ప్రదీప్ అలా ఒక అమ్మాయి గురించి కామెంట్ చేయడం గురించి చర్చ జరిగింది.జీ తెలుగు ఛానల్ లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ 2020 అనే ప్రోగ్రామ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది.

ఈ ప్రోగ్రామ్ కు సింగర్ హారిక కూడా హాజరు కాగా రవి ప్రదీప్ హారిక కోసం ఎంత ట్రై చేసినా వర్కవుట్ కాలేదని తను చెప్పగానే హారిక డ్యాన్స్ చేసిందని కామెంట్ చేశాడు.దీంతో ప్రదీప్ ఆమెను లవ్ చేస్తున్నాడా.? అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.మరి కొందరు మాత్రం రవి ఫన్నీగా అలా చెప్పి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 11వ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుండగా హారిక రవిని అన్న అని పిలవడంతో పాటు రవికి రాఖీ కట్టడం ప్రోమోలో హైలెట్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube