బిగ్ బాస్ గురించి నిజాలు బయటపెడితే షాకవుతారన్న రవి.. అలాంటి వ్యక్తిని కాదంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకుల్లో, బిగ్ బాస్ షో అభిమానులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.కొందరు ఈ షో స్క్రిప్టెడ్ షో అని అభిప్రాయం వ్యక్తం చేస్తే మరి కొందరు మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు ఇష్టానుసారం కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తారని కొంతమంది కామెంట్లు చేస్తారు.

 Anchor Ravi Shocking Comments About Bigg Boss Show Details, Anchor Ravi, Bigg Bo-TeluguStop.com

అయితే తాజాగా రవి బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బిగ్ బాస్ హౌస్ నుంచి 12వ వారం ఎలిమినేట్ అయిన రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని కామెంట్లు వినిపించాయి.

టాప్ 5 కంటెస్టెంట్లలో రవి ఉంటారని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది.రవి రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నా ఫినాలేకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రవి రీఎంట్రీ సాధ్యం కాకపోవచ్చు.

అయితే రవి మాత్రం బిగ్ బాస్ షో గురించి స్పందిస్తూ ఎవరికీ తెలియని విషయాలను వెల్లడిస్తున్నారు.తాజాగా రవి బిగ్ బాస్ షోకు సంబంధించి వీడియో మెసేజ్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ రవి ఈ షోలో జరుగుతున్నది వేరని బయట చూపిస్తున్నది వేరని తెలిపారు.

Telugu Anchor Ravi, Anchorravi, Bigg Boss, Bigg Boss Show, Ravi, Trolls-Movie

బిగ్ బాస్ షో గురించి తాను నిజాలను బయటపెడితే మీరు కూడా ఆశ్చర్యపోతారని రవి చెప్పుకొచ్చారు.అయితే తాను ఎవరి గురించి నెగటివిటీ స్ప్రెడ్ చేయనని తాను అలాంటి వ్యక్తిని కాదని రవి కామెంట్లు చేశారు.తాను బిగ్ బాస్ హౌస్ నుంచి ఓడిపోయి బయటకు వచ్చాను కాబట్టి సైలెంట్ గా ఉన్నానని రవి తెలిపారు.

Telugu Anchor Ravi, Anchorravi, Bigg Boss, Bigg Boss Show, Ravi, Trolls-Movie

కొంతమంది తన కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోల్ చేశారని రవి ఆవేదన వ్యక్తం చేశారు.తనకు మద్దతు నిలిచిన వాళ్లకు రవి కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని పరోక్షంగా రవి కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube