హీరోగా రెండో సినిమా చేస్తున్న యాంకర్ రవి

ఈ మధ్యకాలంలో టెలివిజన్ పై యాంకర్స్ గా రాణిస్తున్న అందాల భామలు హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా అవకాశాలు తెచ్చుకుంటూ బిజీ అవుతున్నారు.వీరిలో అనసూయ ముందు వరుసలో ఉంటే రష్మి తరువాత స్థానంలో ఉంది.

 Anchor Ravi Second Movie Ready To Release, Tollywood, Telugu Television, South C-TeluguStop.com

వర్షిని, విష్ణుప్రియ కూడా గ్లామర్ గేట్లు తెరవడంతో వారికి కూడా మెల్లగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అదే దారిలో మేల్ యాంకర్స్ కూడా నటులుగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రిముఖి అయితే ఓ వైపు యాంకర్ గా మరో వైపు నటిగా సెలక్టివ్ సినిమాలు చేస్తూ తన ప్రయాణం సాగిస్తుంది.జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని తరువాత యాంకర్ గా మారిన సుదీర్ నటుడుగా బిజీ అవుతున్నాడు.

అలాగే స్టార్ మేల్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ఒక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు కొత్త కథలు వింటున్నాడు.

నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు.ఇలా బుల్లితెరపై రియాలిటీషో యాంకర్స్ గా రాణిస్తున్న వీళ్ళు వెండితెరపైకి తమ అడుగులుని సాగిస్తున్నారు.

ఇదే దారిలో యాంకర్ రవి కూడా జర్నీ చేస్తున్నాడు.నటుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి వచ్చిన రవి తరువాత తన టాలెంట్ తో యాంకర్ గా మారి అవకాశాలు పెంచుకున్నాడు.

ప్రస్తుతం లీడింగ్ చానల్స్ లో సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నాడు.ఇప్పటికే రవి సినిమాలోకి అడుగుపెట్టి క్యారేక్తర్ట్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు.అయితే పూర్తి స్థాయి హీరోగా ఇది మా ప్రేమకథ అనే సినిమా చేశాడు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

అయితే ఇప్పుడు రెండో ప్రయత్నంగా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ ని ఎంచుకున్నాడు.తోటబావి టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.మరి ఈ సినిమాతో రవి తన అదృష్టాన్ని ఎంత వరకు పెంచుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube