పోలీసుల అదుపులో యాంకర్ రవి.? 20 మందితో దాడికియత్నం? దీనిపై రవి ఏమని స్పందించారంటే.?     2018-10-29   09:00:19  IST  Sai Mallula

యాంకర్ రవి మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ రవిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాకీ వసూలుకు యాంకర్ రవి తనను ఫోన్‌లో బెదిరించాడన్నారు. అంతేగాక 20 మందితో ఇనుప రాడ్లతో దాడికి యత్నించాడని సినీ డిస్ట్రిబ్యూటర్ సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Anchor Ravi Responds On Arrest Issue-

Anchor Ravi Responds On Arrest Issue

యాంకర్ రవి నటించిన ఇది మా ప్రేమ కథ చిత్రాన్ని తానే రిలీజ్ చేసినట్టు సందీప్ మీడియాకు తెలిపాడు. ఆ సినిమాకు, ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఆటగాళ్లు, యూటర్న్ తదితర చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసిన సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.

Anchor Ravi Responds On Arrest Issue-

అయితే ఈ విషయంపై రవి స్పందించారు. ఎస్సార్ నగర్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్లు వచ్చినవార్తల్లో నిజం లేదని యాంకర్ రవి వెల్లడించారు. స్తుతం యాంకర్ రవి మచిలీపట్నంలో ఉన్నారట. జెమినీ టీవీ వారు నిర్వహిస్తున్న దిపావళి సెలెబ్రేషన్స్ లో పాల్గొంటున్నాను. నాపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదు అని రవి ఓ వీడియో విడుదల చేశారు.