బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ రవి రీఎంట్రీ అంటూ ప్రచారం.. కానీ?

Anchor Ravi Reentry News Goes Viral In Social Media

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 12వ వారంలో హౌస్ నుంచి

రవి ఎలిమినేట్

కావడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.ఓట్లు తక్కువగా రావడం వల్లే రవిని ఎలిమినేట్ చేసినట్టు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటించినా రవిని ఎలిమినేట్ చేయడం ప్రేక్షకుల్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

 Anchor Ravi Reentry News Goes Viral In Social Media-TeluguStop.com

రవి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావించారు.అయితే రవి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో కొంతమంది కంటెస్టెంట్లు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో రవి రీఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.సోషల్ మీడియాలో రవి రీఎంట్రీ గురించి చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Anchor Ravi Reentry News Goes Viral In Social Media-బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ రవి రీఎంట్రీ అంటూ ప్రచారం.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవి ఎలిమినేట్ అయిన సమయంలో ఓట్ల లెక్కలు చూపించాలని రవి ఫాలోవర్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి బిగ్ బాస్ నిర్వాహకులు కానీ రవి కానీ స్పందించడం లేదు.

బిగ్ బాస్ హౌస్ లో చాలాసార్లు నామినేషన్ నుంచి సేవ్ అయిన రవి 12వ వారం మాత్రం ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు.అయితే విశ్లేషకులు మాత్రం రవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అసాధ్యం అని అభిప్రాయపడుతున్నారు.రవి బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది.స్టార్ మా ఛానల్ ప్రోగ్రామ్స్ తో రవి బిజీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

గతంలో రవి సినిమాల్లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేదు.మరోవైపు సన్నీ, షణ్ముఖ్ లలో ఒకరు బిగ్ బాస్ షో విన్నర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎవరు బిగ్ బాస్ షో విన్నర్ గా నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

#Biggboss #Reentry #Anchor #Biggboss #Anchor Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube