యాంకర్ రవికి ఎంత ఆస్తి ఉందో తెలుసా..??

బుల్లితెరపై మేల్ యాంకర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వారిలో ఒక్కరు యాంకర్ రవి.ఆయన యాంకర్ గా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Anchor Ravi Properties And Details , Anchor Ravi, Youtube Channel, Hero, Expensi-TeluguStop.com

ఇక యాంకర్ రవి ఒకపక్క పలురకాల షోలు ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో కూడా అడపాదడపా పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు.తాజాగా యాంకర్ రవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు అన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ ఇంత సింపుల్ గా ఉండటానికి కారణం ఏంటని అడగ్గా యాంకర్ రవి స్పందిస్తూ తనకు ఎంత డబ్బు, ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉండడమే ఇష్టమని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.కోట్ల రూపాయల ఖరీదైన కార్లు, బంగ్లాలు వంటి వాటిపై తనకి మోజు లేదని తనకు ఎప్పుడూ కూడా తనకి ఉన్నంతలో ఉన్నవాటితో సర్దుకుపోవడమే ఇష్టమని వెల్లడించారు.అంతేకాక.తన కూతురు భవిష్యత్తు కోసం మంచి విద్య అందించి ఆమెకు ఒక చక్కని జీవితాన్ని అందిస్తే తనకు అదే సంతృప్తి అని కూడా తెలిపారు.ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Telugu Anchor Ravi, Expensive Cars, Comedians, Comedians Maa, Youtube Channel-Te

అయితే పలువురు నెటిజన్లు ప్రస్తుత కాలంలో 50 లేదా లక్ష రూపాయలు జీతం రాగానే కార్లు, బంగ్లాలు అంటూ తెగ జల్సా చేసే ఈ రోజుల్లో అన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉండేటువంటి రవి ని చూసి రవి డబ్బులున్న నిరాడంబరుడు 1’అంటూ కామెంట్లు పెడుతున్నారు.కాగా.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రవి టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మాలో స్టార్ కమెడియన్స్ లో చేస్తున్నాడు.

అంతేకాదు.ప్రస్తుతం ఆయన ఐదు షోలకు యాంకర్ గా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube