అభిజిత్ గెలుపు కోసం కష్టపడుతున్న టాప్ యాంకర్..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్లలో అభిజిత్ ఒకరు.ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ప్రతిసారి అభిజిత్ కు భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయని సమాచారం.

 Anchor Ravi Promotes Abhijeet To Win Bigg Boss Title, Anchor Ravi, Akhil, Harika-TeluguStop.com

బిగ్ బాస్ షోలో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు సైతం అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.అయితే టాలీవుడ్ టాప్ యాంకర్ రవి కూడా అభిజిత్ గెలుపు కోసం కష్టపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.

రవి అభిజిత్ కోసం క్యాంపైన్ నిర్వహిస్తున్నారని అభిజిత్ రవి బంధువులని సమాచారం.రవికి అభిజిత్ కజిన్ బ్రదర్ అవుతారని తెలుస్తోంది.యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిజిత్ కు బయట ఫాలోయింగ్ పెరిగే విధంగా తన వంతు కృషి చేస్తున్నారు.ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రవి యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిజిత్ ను ప్రమోట్ చేస్తున్నారు.ఈ ఛానల్ లో నిర్వహించే ఇంటర్వ్యూల్లో గెస్టులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ అభిజిత్ అని చెప్పేలా చేస్తున్నారు,

Telugu Abhijeet, Akhil, Anchor Ravi, Anchorravi, Bigg Boss, Harika, Monal, Telug

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పాటు పెళ్లి గోల వెబ్ సిరీస్ అభిజిత్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.మరోవైపు హౌస్ లో అభిజిత్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.మొన్నటి ఎపిసోడ్ లో హౌస్ తనకు తనే పోటీ అని.తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరూ లేరని అభిజిత్ చెప్పారు.మొదట మోనాల్ తో సన్నిహితంగా మెలిగిన అభిజిత్ ప్రస్తుతం హారికతో ఎక్కువగా మాట్లాడుతున్నారు.

Telugu Abhijeet, Akhil, Anchor Ravi, Anchorravi, Bigg Boss, Harika, Monal, Telug

అయితే బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం అభిజిత్ కంటే అఖిల్, ఇతర కంటెస్టెంట్లనే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు.మరి సెలబ్రిటీల అంచనాలకు అనుగుణంగా అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube