బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నుంచి 12వ వారం రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఎలిమినేషన్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బిగ్ బాస్ హౌస్ లోకి జస్ట్ రవిగానే వెళ్లానని యాంకర్ రవిగా వెళ్లలేదని తెలిపారు.
బిగ్ బాస్ షో ద్వారా తాను చాలామంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యానని రవి చెప్పుకొచ్చారు.తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని ఎప్పుడూ భావించలేదని రవి వెల్లడించారు.
అయితే ఆటపై ఉండే నమ్మకం వల్ల టాప్ 5లో ఉంటానని అనుకున్నానని కానీ ఊహించని విధంగా బయటకు వచ్చానని రవి పేర్కొన్నారు.కాజల్ ఎలిమినేట్ అవుతుందని ఆమె భావించిందని అయితే సన్నీకి ఫ్రీ ఎవిక్షన్ పాస్ దక్కడంతో తాను ఎలిమినేట్ అవుతానని బిగ్ బాస్ జర్నీ అయిపోయిందని అనిపించిందని రవి చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ముందే తనకు నటరాజ్ మాస్టర్ తో పరిచయం ఉందని రవి అన్నారు.
తాను, నటరాజ్ మాస్టర్ కలిసి డ్యాన్స్ షోలతో పాటు ఈవెంట్లు చేశామని రవి చెప్పుకొచ్చారు.
నటరాజ్ మాస్టర్ తన గేమ్ ను నేను చెడగొడతానని భావించి ఆ విధంగా మాట్లాడారని రవి అన్నారు.నేను ఎవరితో మాట్లాడినా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుతున్నానని ఆయన భావించేవారని రవి వెల్లడించారు ఆ రీజన్ వల్లే తనకు గుంటనక్క అని పేరు పెట్టారని అయితే తాను అంగీకరించలేదని రవి అన్నారు.
సన్నీ కూడా ఒకసారి తనను ఫేక్ అని అన్నాడని సన్నీ ఆ విధంగా అన్నా తాను ఫీల్ కాలేదని రవి చెప్పుకొచ్చారు.తనకు సేఫ్ గేమ్ అంటే తెలియదని నామినేషన్ విషయంలో కూడా తాను బాధ పడలేదని రవి వెల్లడించారు.పింకీ, మానస్ తనకంటే వీక్ ప్లేయర్స్ అని రవి అభిప్రాయపడ్డారు.